YS Sharmila | పోలీసులను తోసేసిన వైఎస్ షర్మిల.. లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్-ysrtp president ys sharmila was arrested by the police ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila | పోలీసులను తోసేసిన వైఎస్ షర్మిల.. లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్

YS Sharmila | పోలీసులను తోసేసిన వైఎస్ షర్మిల.. లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్

Published Apr 24, 2023 01:21 PM IST Muvva Krishnama Naidu
Published Apr 24, 2023 01:21 PM IST

  • హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇంటి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారులో బయటకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వైఎస్ షర్మిల పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా కాసేపు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. అనంతరం పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు.

More