Nara Lokesh: ఓడినప్పటికీ ఎన్నో చేస్తున్నాను... గెలిస్తే ఏం చేస్తానో ఆలోచించండి
- Nara Lokesh On 2024 Elections: వచ్చే ఎన్నికల్లో తనను మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి గెలిపించాలని ప్రజలను కోరారు నారా లోకేశ్. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనని గత ఎన్నికల్లో ఓడించినప్పటికీ పదికి పైగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. అలాంటి తనని గెలిపిస్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. గెలిచిన ఏడాదిలోపే పేదలకు ఇంటి పట్టాలు అందజేస్తానని హామీనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.