minister ktr satirical on modi | మోడీపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్
- ప్రధాని నరేంద్ర మోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆయన మహానటుడు అని ఆస్కార్‌కు పంపితే అవార్డు వచ్చేదని మోదీని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. నిన్న గాక మొన్న మన తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. మన పాటకు అవార్డు వచ్చింది. కానీ మన దేశంలో అద్భుతమైన మహానటుడు ఒకాయన ఉన్నాడు. ఆ మహానటుడిని కూడా పంపితే ఆయన నటనకు కూడా ఆస్కార్ అవార్డు తప్పకుండా వచ్చేది. ఆ మహానటుడు ఎవరో మీకు యాదికి ఉన్నాడా అని కేటీఆర్ ప్రశ్నించగానే సభకు వచ్చిన వారి నుంచి మోదీ అంటూ నినాదాలు వినిపించాయి.