Minister KTR| మోడీ సర్కారు చేతిలో ఈడీ కీలుబొమ్మ.. సీబీఐ తోలుబొమ్మ-minister ktr fire on ed case ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Ktr| మోడీ సర్కారు చేతిలో ఈడీ కీలుబొమ్మ.. సీబీఐ తోలుబొమ్మ

Minister KTR| మోడీ సర్కారు చేతిలో ఈడీ కీలుబొమ్మ.. సీబీఐ తోలుబొమ్మ

Published Mar 09, 2023 05:32 PM IST Muvva Krishnama Naidu
Published Mar 09, 2023 05:32 PM IST

  • దేశాన్ని బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్‌ తొలిసారి స్పందించారు. బీజేపీ ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోంది. మోదీ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలుబొమ్మ. ఆ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీఆర్‌ఎస్‌పై ఉసిగొల్పుతోందన్నారు. ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ నోటీసులు అందాయన్న కేటీఆర్... కానీ, అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు అని అన్నారు. మోడీ సమన్లకు ఎవరూ భయపడరని, రాజకీయ వేదింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. గౌతమ్‌ అదానీ ఎవరి బినామీ? ఎల్‌ఐసీ డబ్బులు ఆవిరైతే ప్రధాని ఉలకడు, పలకడన్నారు. 2014 తర్వాత 95శాతం ఈడీ దాడులు విపక్షాలపైనే జరిగాయని కేటీఆర్ ఆరోపించారు.

More