Minister KTR : ‘అవ్వ’ మాస్ స్పీచ్... దండం పెట్టిన మంత్రి కేటీఆర్-brs activist mass speech at jawaharnagar meeting ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Ktr : ‘అవ్వ’ మాస్ స్పీచ్... దండం పెట్టిన మంత్రి కేటీఆర్

Minister KTR : ‘అవ్వ’ మాస్ స్పీచ్... దండం పెట్టిన మంత్రి కేటీఆర్

Published Apr 15, 2023 06:00 PM IST HT Telugu Desk
Published Apr 15, 2023 06:00 PM IST

  • జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన లీచెట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం 3,619 మంది లబ్ధిదారులకు జీవో నెం.58కింద పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా సభపై ఓ అవ్వ స్పీచ్ ఇరగదీసింది. కేసీఆర్, కేటీఆర్ మాస్ లీడర్స్ అంటూ మాట్లాడింది. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. 50 ఏళ్లు అధికారంలో ఉండి అభివద్ధి చేయలేదని.. కొందరు అవకాశం ఇవ్వాలని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి వారిని నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం జవహర్‌నగర్‌ తీసుకొచ్చిన చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి దాన్ని రైతులకు అమ్ముతున్నామని చెప్పారు. పొడి చెత్త నుంచి కరెంట్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా న ల్లగా మారిన మల్కారం చెరువును తెల్లగా చేసేందుకు కొత్తగా లీచెట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ తీసుకొచ్చామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో జవహర్‌నగర్‌ ప్రజల సమస్యలన్నీ తీరుస్తామని హామీనిచ్చారు. ఇక మంత్రి మల్లారెడ్డి మరోసారి జోష్ గా మాట్లాడి అందర్నీ నవ్వించారు.

More