Bandi Sanjay On SIT Notices: ఎమ్మెల్యేల ఎర కేసు విచారణలో భాగంగా సిట్ (SIT) అధికారులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించారు బండి సంజయ్. దేశం కోసం పనిచేస్తున్న గొప్ప వ్యక్తి బీఎల్ సంతోష్ అని కొనియాడారు. బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు ఫామ్ హౌసులు, బ్యాంక్ అకౌంట్లు లేవని తెలిపారు. నోటీసుల పేరుతో సంఘ్ ప్రచారక్‌లను అవమానిస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. దేశం కోసం పనిచేసే వ్యక్తికి నోటీసులెలా ఇస్తారంటూ స్టేజి మీదే కన్నీటి పర్యంతమయ్యారు.