Time Travel | వారంతా టైమ్ ట్రావెల్ చేశారు.. తిరిగొచ్చారా, ట్విస్ట్ ఇచ్చారా?-study reveals how smell of food can enable time travel ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Time Travel | వారంతా టైమ్ ట్రావెల్ చేశారు.. తిరిగొచ్చారా, ట్విస్ట్ ఇచ్చారా?

Time Travel | వారంతా టైమ్ ట్రావెల్ చేశారు.. తిరిగొచ్చారా, ట్విస్ట్ ఇచ్చారా?

Published Oct 11, 2022 05:46 PM IST Manda Vikas
Published Oct 11, 2022 05:46 PM IST

  • టైమ్ ట్రావెల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుత కాలం నుంచి గడిచిపోయిన కాలానికి లేదా భవిష్యత్ కాలానికి ప్రయాణించడం. ఆదిత్య 369, బింబిసారా వంటి సినిమాల్లో మీరు చూసే ఉంటారు. వాస్తవంగా ఇలా సాధ్యమవుతుందా అంటే? కొంతమంది వృద్ధులతో తాము టైమ్ ట్రావెల్ చేయించినట్లు లాంకాస్టర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఎలా అంటే? ఆ వృద్ధులకు వారు యవ్వనంలో ఉన్నప్పుడు రుచి చూసిన ఆహార పదార్థాల రుచిని, సువాసనలను మరోసారి చూపించారు. దీంతో వారు తమ ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్లిపోయారు.  అప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లగలిగారు. మరి ఈ విధంగా వారు టైమ్ ట్రావెల్ చేసినట్లేగా అని పరిశోధకులు అంటున్నారు. వారి తాజా అధ్యయనంలో భాగంగా వృద్ధులైన కొంతమంది వాలంటీర్లను ఎంచుకొని వారికి 3D ప్రింటెడ్ ఫ్లేవర్ కలిగిన తినదగిన పదార్థాలను ఇచ్చారు. అవి వివిధ సువాసనలను, ఫ్లేవర్లను వెదజల్లుతాయి. ఇలా వాటి వాసన చూసిన ఒక వృద్దురాలు తనకు ఒక్కసారిగా 25 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించిదని పేర్కొంది. ఆనాటి విషయాలను పంచుకుంది. ఈ అధ్యయనం ప్రకారంగా రుచి, సువాసనలకు మెరుగైన జ్ఞాపకశక్తితో ముడిపడి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

More