మానసిక ఆరోగ్య రుగ్మతలను గుర్తించడంలో రోబోలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు, మానసిక వైద్య నిపుణులు ఓ అధ్యయనం చేశారు. 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గల 28 మంది పిల్లలపై పరిశోధన చేశారు. పిల్లల మానసిక స్థితిని అంచనా వేసేందుకు పలు ప్రశ్నలను తయారు చేశారు. వాటిని రోబోలు వేశాయి. పిల్లలు రోబోట్‌పై నమ్మకంతో సరిగా సమాధానాలు చెప్పారని అధ్యయనంలో తేలింది. పిల్లల మానసిక స్థితిని అంచనా వేయడానికి రోబోలను ఉపయోగించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 1న ఇటలీలోని నేపుల్స్‌లో రోబోట్ అండ్ హ్యూమన్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ (RO-MAN)పై 31వ IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు.