protest over adani row | జేపీసీ వేయాలని గాంధీ విగ్రహం ముందు నిరసన
- అదానీ స్టాక్స్ మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ-జేపీసీ వేయాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అదానీ అంశంపై జేపీసీ వేసే వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎంపీలోపాటు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేశారు. ఇందులో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్జే, రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. వీరితోపాటు బీఆర్ఎస్ ఎంపీలు సైతం పాల్గొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ ఆందోళనలు ఆపమని స్పష్టం చేస్తున్నారు.