Mumbai local train accident | ముంబై లోక‌ల్ ట్రైన్ ప్ర‌మాదం-pkg mumbai local train accident ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mumbai Local Train Accident | ముంబై లోక‌ల్ ట్రైన్ ప్ర‌మాదం

Mumbai local train accident | ముంబై లోక‌ల్ ట్రైన్ ప్ర‌మాదం

Published Jun 25, 2022 05:04 PM IST HT Telugu Desk
Published Jun 25, 2022 05:04 PM IST

ముంబై లోకల్ ట్రైన్‌లలో ఉండే రద్దీ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్‌. ముఖ్యంగా ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో లోక‌ల్ ట్రైన్‌లోకి వెళ్ల‌డ‌మంటే, ఒక యుద్ధం గెలిచినంత గొప్ప‌. చాలా ట్రైన్లలో ప్ర‌యాణీకులు డోర్ల వ‌ద్ద వేలాడుతూ వెళ్తుంటారు. అలా వెళ్తున్న ఒక లోకల్ ట్రైన్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. డోర్ వ‌ద్ద వేలాడుతున్న‌ ఒక ప్రయాణీకుడు ప‌ట్టు జారి వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి కింద ప‌డిపోయాడు. ఈ దృశ్యాన్ని ప‌క్క‌న వెళ్తున్న మ‌రో లోకల్ ట్రైన్ నుంచి రికార్డు చేశారు. ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అయింది. ప్ర‌మాదానికిగురైన ప్రయాణీకుడికి ప్రాణాపాయం త‌ప్పింది. ప్ర‌స్తుతం అత‌డు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

More