ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు.ఆ సినిమాలో కొమురం భీమ్ పాత్రతో అందరిని అలరించిన తారక్ పేరు గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. తాజాగా అమెరికాలోని తారక్ అభిమానులు ఆయనకు వినూత్న రీతిలో థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.