CDS Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్ కు అరుదైన గౌరవం
భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ బిపిన్ రావత్ కు భారతీయ సైన్యం అరుదైన గౌరవంతో సత్కరించింది. గతంలో జనరల్ బిపిన్ రావత్ పని చేసిన అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు మిలటరీ క్యాంప్ పేరును ‘జనరల్ బిపిన్ రావత్ మిలటరీ గ్యారిసన్’ గా మార్చింది. క్యాంప్ కు వెళ్లే 22 కిమీల మార్గానికి కూడా ఆయన పేరు పెట్టింది. అలాగే, క్యాంప్ ప్రవేశద్వారాన్ని జనరల్ రావత్ పేరుతో సంప్రదాయ సిద్ధంగా రూపొందించింది. శనివారం కిబితు మిలటరీ క్యాంప్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి రావత్ ఇద్దరు కుమార్తెలు, అరుణాచల్ ప్రదేశ్ సీఎం, గవర్నర్ లు హాజరయ్యారు. ఒక కార్యక్రమానికి వెళ్తుండగా జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్ మరణించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..