ప్రతిరోజూ బ్లాక్ టీ, గ్రీన్ టీ లేదా ఊలాంగ్ టీని మితంగా తాగటం వలన టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనాలోని వుహాన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ రీసెర్చ్ చేపట్టారు. ఇందుకోసం ఎనిమిది దేశాల నుండి సుమారు 1 మిలియన్ల మంది వ్యక్తుల డేటాను పరిశీలించారు. రోజుకు కనీసం నాలుగు కప్పుల టీ తాగడం వల్ల సగటున 10 సంవత్సరాల కాలంలో మధుమేహం వచ్చే ప్రమాదం 17 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన ఫలితాలను స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ (EASD) వార్షిక సమావేశంలో ప్రదర్శించారు.