తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నా యి. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు.