Mother Temple in AP: అమ్మనే దైవమంటున్న కొడుకు… ఏకంగా ఓ గుడి కట్టిస్తున్నాడు..
- Mother Temple in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాకు చెందిన సనపల శ్రావణ్‌కుమార్... కోట్లాది రూపాయల వ్యయంతో తల్లిపై ప్రేమతో ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఈ అమ్మ దేవస్థానాన్ని ఏక క్రిష్ణశిలతో నిర్మిస్తున్నారు. ఆలయ పనులను స్వగ్రామమైన ఆమదాలవలస మండలం చీమలవలసలో చేపట్టారు. అమ్మను మించిన దైవం లేదంటూ ఏకంగా ఆమెకు గుడికట్టాలని నిర్ణయించుకున్నారు శ్రావణ్ కుమార్. సాదాసీదాగా ఒక చిన్న మండపం కట్టి అందులో విగ్రహం పెట్టడం కాకుండా.. ఏకంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఏకశిలతో అద్భుతంగా మందిర నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్‌లో స్తిరాస్థి వ్యాపారంతో బాగా స్థిరపడిన శ్రావణ్‌కుమార్.. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటేందుకు ఈ కార్యాన్నిప్రారంభించాడు. ఈ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే గుడిని ప్రారంభించే అవకాశం ఉంది.