Pawan On CM Jagan: డబ్బులు దొబ్బేసి జైలుకు వెళ్ళాడు, అతనేం తిలక్ కాదు..!
- ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చేరిగారు జనసేన అధినేత పవన్. గణతంత్ర వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పవన్ ప్రసంగించారు. ఏపీలో కుల పిచ్చి ఉంది. సీఎం మా వాడని ఓటు వేస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు. అంతేకాదు జగన్ టీనేజ్ లో ఉన్నప్పుడు కడపలోని పులివెందులలో ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టిన ఘనత ఉందంటూ ఆరోపించారు. ఐదు వేలతో ఉద్యోగాలు చేయాలని అనటమేంటని ప్రశ్నించారు. జగనేమీ బాలగంగధర్ తిలక్ కాదని.. డబ్బులు దొబ్బేసి జైలుకు వెళ్లాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని నమ్మి ప్రజలు ఓట్లేసినప్పటికీ... వారందన్నీ మోసం చేశాడని కామెంట్స్ చేశారు. మరోవైపు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.