Ambani Visits Tirumala : శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ.. భారీగా విరాళం-mukesh ambani offered prayers to lord venkateshwara at tirumala temple ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ambani Visits Tirumala : శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ.. భారీగా విరాళం

Ambani Visits Tirumala : శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ.. భారీగా విరాళం

Published Sep 16, 2022 07:10 PM IST Mahendra Maheshwaram
Published Sep 16, 2022 07:10 PM IST

  • Mukesh Ambani Visits Tirumala: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంబానీ కుటుంబం సమేతంగా అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. కుటుంబానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసింది టీటీడీ. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీస్సులు అందుకున్నారు. అంబానీ మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని సందర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తిరుమల దేవస్థానం ఏటా అభివృద్ధి చెందుతోందని కొని యాడారు. ఈ సందర్భంగా టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఇచ్చారు. ఈ పర్యటనలో ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి వచ్చారు. వీడియోని చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…….

More