Pawan Kalyan at Rushikonda : రుషికొండ తవ్వకాలను పరిశీలించిన జనసేనాని
- Pawan Vizag Tou: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం రుషికొండను సందర్శించారు. గత కొద్దీ నెలలుగా రుషికొండపై వైసీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ అంశం సుప్రీకోర్టు వరకు కూడా చేరింది. ఈ ఆరోపణల నేపథ్యంలో స్వయంగా పవన్ కల్యాణ్.. రుషికొండ వద్ద జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఉప్పాడ బీచ్ లో కాసేపు పవన్ సరదాగా గడిపారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి బీచ్ లో నడుస్తూ ఆహ్లాదంగా గడిపారు. ఈ సమయంలో పలువురు మత్స్యకారులతో కూడా మాట్లాడారు.