Washington Sundar Record: టీ20ల్లో దినేష్ కార్తిక్ రికార్డ్ బ్రేక్ చేసిన సుంద‌ర్-washington sundar surpass dinesh karthik fastest half century record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Washington Sundar Surpass Dinesh Karthik Fastest Half Century Record

Washington Sundar Record: టీ20ల్లో దినేష్ కార్తిక్ రికార్డ్ బ్రేక్ చేసిన సుంద‌ర్

Nelki Naresh Kumar HT Telugu
Jan 28, 2023 09:26 PM IST

Washington Sundar Record: శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్ రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ టీ20ల్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగి అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ చేసిన టీమ్ ఇండియా క్రికెట‌ర్‌గా నిలిచాడు

వాషింగ్ట‌న్ సుంద‌ర్
వాషింగ్ట‌న్ సుంద‌ర్

Washington Sundar Record: శుక్ర‌వారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 21 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నా అత‌డి పోరాటం వృథాగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ టీ20 మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌లో భార‌త పేస‌ర్ అర్ష‌దీప్‌సింగ్ 27 ప‌రుగులు ఇవ్వ‌డం టీమ్ ఇండియా ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణ‌మైంది. ఈ ఓవ‌ర్ ద్వారా టీ20ల్లో చెత్త రికార్డ్‌ను అర్ష‌దీప్ సింగ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ ఇండియా త‌ర‌ఫున టీ20ల్లో చివ‌రి ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు ఇచ్చిన బౌల‌ర్‌గా నిలిచాడు. గ‌తంలో ఈ చెత్త రికార్డ్ సురేష్ రైనా పేరు మీద ఉంది.

2012లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్ వేసిన సురేష్ రైనా 26 ప‌రుగులు ఇచ్చాడు. ఆ చెత్త రికార్డ్‌ను న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్ ద్వారా అర్ష‌దీప్‌సింగ్ బ్రేక్ చేశాడు. అంతే కాకుండా ఇంట‌ర్‌నేష‌న‌ల్ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక నోబాల్స్ వేసిన బౌల‌ర్‌గా మ‌రో చెత్త రికార్డ్‌ అర్ష‌దీప్‌సింగ్ ఖాతాలో చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు 22 మ్యాచ్‌ల‌లో అత‌డు 14 నోబాల్స్ వేశాడు.

ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టిన ఆల్ రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఓ రికార్డ్ నెల‌కొల్పాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగి అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్న టీమ్ ఇండియా క్రికెట‌ర్‌గా సుంద‌ర్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో 25 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు సుంద‌ర్‌. గ‌త ఏడాది సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో దినేష్ కార్తిక్ 26 బాల్స్‌లో హాఫ్ సెంచ‌రీ చేశాడు. అత‌డి రికార్డ్‌ను తొలి టీ20 ద్వారా సుంద‌ర్ బ్రేక్ చేశాడు.

WhatsApp channel