Sreesanth: అబుదాబి లీగ్‌తో మెంట‌ర్‌గా కొత్త ఇన్నింగ్స్ మొద‌లుపెట్ట‌నున్న శ్రీశాంత్‌-sreesanth joins as a mentor for bangla tigers team in abu dhabi t10 league ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sreesanth: అబుదాబి లీగ్‌తో మెంట‌ర్‌గా కొత్త ఇన్నింగ్స్ మొద‌లుపెట్ట‌నున్న శ్రీశాంత్‌

Sreesanth: అబుదాబి లీగ్‌తో మెంట‌ర్‌గా కొత్త ఇన్నింగ్స్ మొద‌లుపెట్ట‌నున్న శ్రీశాంత్‌

HT Telugu Desk HT Telugu
Aug 27, 2022 05:26 PM IST

టీమ్ ఇండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ మెంటర్ గా కొత్త కెరీర్ ను మొదలుపెట్టబోతున్నాడు. అతడు మెంటర్ గా వ్యవహరించనున్న జట్టు ఏదంటే....

<p>శ్రీశాంత్</p>
శ్రీశాంత్ (twitter)

టీమ్ ఇండియా మాజీ ఆట‌గాడు శ్రీశాంత్ మెంట‌ర్‌గా కొత్త ఇన్నింగ్స్ మొద‌లుపెట్ట‌బోతున్నాడు. కేర‌ళ స్పీడ్‌స్టార్‌గా డొమెస్టిక్ క్రికెట్ లో ప్ర‌తిభ‌ను చాటిన శ్రీశాంత్ 2005లో టీమ్ ఇండియాకు సెలెక్ట్ అయ్యాడు. కొద్ది రోజుల్లోనే భారత జట్లు ప్ర‌ధాన బౌల‌ర్ల‌లో ఒక‌డిగా పేరుతెచ్చుకున్నాడు. టెస్టులు, వ‌న్డేల‌తో పాటు టీ20ల్లో రాణించాడు. టీ20 క్రికెట్‌లో భార‌త్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన తొలి కేర‌ళ క్రికెట‌ర్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో దోషిగా తేల‌డంతో శ్రీకాంత్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు ప‌డింది. దాదాపు ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్న అత‌డు 2020లో రీఎంట్రీ ఇచ్చాడు. కేర‌ళ టీమ్ త‌ర‌ఫున రంజీ ట్రోపీ ఆడాడు. ఈ ఏడాది మార్చిలో డొమెస్టిక్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శ్రీశాంత్ తాజాగా కొత్త కెరీర్ మొద‌లుపెట్ట‌బోతున్నాడు. అబుదాబి టీ10 లీగ్‌లో బంగ్లా టైగ‌ర్స్ జ‌ట్టుకు మెంట‌ర్‌గా బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌నున్నాడు. ఈ ఏడాది నవంబర్ లో టీ10 లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభం కానుంది.

ఇందులో బంగ్లా టైగర్స్ టీమ్ కోచ్ అఫ్తాబ్ అహ్మద్, అసిస్టెంట్ కోచ్ నజ్ముల్ అబెదిన్ లతో కలిసి శ్రీశాంత్ పనిచేయబోతున్నాడు. బౌలర్ గా శ్రీశాంత్ కు ఉన్న అనుభవం తమ టీమ్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని బంగ్లా టైగర్స్ టీమ్ ఓనర్ మహమ్మద్ యాసిన్ చౌదరి పేర్కొన్నాడు. 2022 ఐపీఎల్ వేలం పాటలో కనీసధర యాభై లక్షలతో శ్రీశాంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. కానీ అతడిని ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు.

Whats_app_banner

టాపిక్