Senegal vs Qatar 2022 FIFA World Cup: సెనెగల్ ప్రపంచకప్ ఆశలు సజీవం.. ఖతర్‌పై అద్భుత విజయం -senegal defeat qatar with 3 1 in fifa t20 world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Senegal Defeat Qatar With 3-1 In Fifa T20 World Cup 2022

Senegal vs Qatar 2022 FIFA World Cup: సెనెగల్ ప్రపంచకప్ ఆశలు సజీవం.. ఖతర్‌పై అద్భుత విజయం

Maragani Govardhan HT Telugu
Nov 25, 2022 08:57 PM IST

Senegal vs Qatar 2022 FIFA World Cup: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో సెనెగల్.. ఆతిథ్య జట్టుపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 3-1 తేడాతో గెలిచి తదుపరి రౌండుకు అర్హత పరంగా ఆశలు సజీవంగా ఉంచుకుంది.

ఖతర్ పై సెనెగల్ విజయం
ఖతర్ పై సెనెగల్ విజయం (FIFA World Cup Twitter)

Senegal vs Qatar 2022 FIFA World Cup: ఆఫ్రికన్ ఛాంపియన్ సెనెగల్ ఫిఫా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన సెనెగల్.. ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టు ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెనెగల్ 3-1 తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా రౌండ్ ఆఫ్ 16 ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ జట్టులో బౌలాయే దియా, ఫమారా డీధౌ, బాంబ డియాంగ్ గోల్స్ సాధించిన తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరోపక్క ఖతర్ తరఫున మహమమ్మద్ ముంటారి మినహా మిగిలినవారు గోల్ చేయడంలో విఫలమయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

మ్యాచ్ ప్రారంభం నుంచి ఉత్కంఠగా మొదలైంది. సెనెగల్ జట్టు మూడో నిమిషంలో గోల్ కొట్టేందుకు యత్నించింది. అయితే అది వైడ్‌గా వెళ్లడంతో గోల్ సాధ్యం కాలేదు. ఐదు నిమిషాల తర్వాత నంప్లేస్ మెండీ మరోసారి ఖతర్ బాక్స్‌లో గోల్ కొట్టేందుకు ప్రయత్నించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. మరోపక్క డిఫెన్స్‌ పరంగానూ సెనెగల్ జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. రెండు సార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించి విఫలమైన సెనెగల్‌కు 40వ నిమిషంలో ఆ కోరిక తీరింది. బౌలాయే దియా గోల్ కొట్టడంతో సెనెగల్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

సెకండాఫ్‌లో సెనెగల్ తన డామినేషన్‌ను కొనసాగించింది. 48వ నిమిషంలో ఫమారా అదిరిపోయే గోల్ సాధించిడంతో లీడ్ 2-0తో మరింత దూసుకెళ్లింది. అప్పటి నుంచి గోల్ కొట్టేందుకు పదే పదే ప్రయత్నించిన ఖతర్‌కు సెనెగల్ ఆటగాళ్లు గట్టిగా ఢిపెన్స్ చేశారు. చివరకు 78వ నిమిషంలో మహమ్మద్ ముంటారి గోల్ కొట్టాడు. ఫలితంగా ఖతర్‌ ఖాతాలో మొదటి వరల్డ్ కప్ గోల్ నమోదైంది. అయితే ఆ కాసేపటికే వారికి ఆ ఆనందాన్ని కూడా మిగల్చలేదు సెనెగల్ ప్లేయర్ డియాంగ్. 83వ నిమిషంలో గోల్ సాధించిం ఆధిక్యాన్ని మరింత పెంచాడు. చివరి వరకు అదే లీడ్‌ను కొనసాగించి 3-1 తేడాతో సెనెగల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం