Rishabh Pant | లగ్జరీ వస్తువుల మోజులో పడి కోట్లలో మోసపోయిన పంత్-rishabh pant cheated by haryana cricketer mrinank singh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant | లగ్జరీ వస్తువుల మోజులో పడి కోట్లలో మోసపోయిన పంత్

Rishabh Pant | లగ్జరీ వస్తువుల మోజులో పడి కోట్లలో మోసపోయిన పంత్

Maragani Govardhan HT Telugu
May 24, 2022 11:52 AM IST

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మోసపోయాడు. మృణాంక్ సింగ్ అనే క్రికెటర్ పాత వాచీలు, నగలు అమ్మిపెడతానని పంత్‌ వద్ద ఉన్న సరుకు తీసుకుని రూ.1.63 కోట్ల బోగస్ చెక్ ఇచ్చాడు. చెక్ బౌన్స్ కావడంతో పంత్ అతడిపై కేసు నమోదు చేశాడు.

రిషభ్ పంత్
రిషభ్ పంత్ (PTI)

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. మరో క్రికెటర్ చేతిలో మోసపోయాడు. స్వతహాగా ఆడంబరాలు, లగ్జరీ వాచీలు, నగలు మెచ్చే పంత్‌ను కోరికలను ఆసరా తీసుకుని హరియాణాకు చెందిన మృణాంక్ సింగ్ అనే క్రికెటర్ మోసగించాడు. ఖరీదైన వాచీలను మంచి రేటుకు అమ్మిపెడతానని పంత్‌ను నమ్మబలికి రెండు కోట్ల వరకు సొమ్మును కాజేశాడు. ఖరీదైన వాచీలు, నగలు, మొబైల్ ఫోన్లను(Used things) మంచి ధరకు అమ్మిపెడతానని, అలాగే బ్రాండెడ్ వాచీలను అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని రిషభ్ పంత్‌ను కలిశాడు.

ప్రస్తుతం మృణాంక్ సింగ్ ముంబయి ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. ఓ వ్యాపారువేత్త ఫిర్యాదుతో అతడిని పోలీసులు అరెస్టు చేశాడు. దాదాపు రూ.2 వరకు కోట్లను మోసపోయిన పంత్.. తన లాయర్ పునీత్ సోలంకీ సహాయంతో మృణాంక్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. ఇప్పటికే జైలులో ఉన్న అతడిపై ఈ ఫిర్యాదును కూడా జోడించారు.

వాచీలంటే అమితంగా ఇష్టపడే పంత్.. తన వద్ద ఉన్న రూ.36.25 లక్షల విలువ చేసే ఫ్రాంక్ ముల్లర్ వాన్‌గార్డ్ యాచ్‌టింగ్ సిరీస్‌కు చెందిన వాచీని, 62.60 లక్షల విలువ చేసే రిచర్డ్ మిల్లే వాచీని మృణాంక్‌కు ఇచ్చి మంచి ధరకు అమ్మిపెట్టాలని కోరాడు. అంతటితో ఆగకుండా బ్రాండెడ్ వాచీలను తక్కువ ధరకే వస్తాయని అత్యాశకు పోయి రూ.2 కోట్లకు పైగా మొత్తాన్ని అతడికి ముట్టజెప్పాడని సమాచారం. పంత్ వద్ద నుంచి వాచీలు తీసుకున్న మృణాంక్.. అతడికి రూ.1.63 కోట్ల చెక్ ఇచ్చాడు. తీరా ఆ చెక్ బౌన్స్ కావడంతో మోసపోయానని గ్రహించిన పంత్..తన న్యాయవాది పునీత్ సోలంకి సహాయంతో కేసు నమోదు చేశాడు.

ఈ కేసులో ఏడాది పాటు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానంలో పోలీసును ఆదేశించింది. 23 మృణాంక్ ఇలా పంత్ ఒక్కడినే కాకుండా ముంబయిలో పలువురు సినిమా డైరెక్టర్లను కూడా మోసం చేసినట్లు సమాచారం.

 

WhatsApp channel

టాపిక్