Rahul Tripathi: అతడు క్రీజులో ఉంటే స్కోరు వేగం పెరుగుతుంది.. రవిశాస్త్రి కితాబు-ravi shastri says when he bats score board keep moving ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ravi Shastri Says When He Bats Score Board Keep Moving

Rahul Tripathi: అతడు క్రీజులో ఉంటే స్కోరు వేగం పెరుగుతుంది.. రవిశాస్త్రి కితాబు

Maragani Govardhan HT Telugu
Jun 24, 2022 09:19 PM IST

ఐపీఎల్ సన్‌రైజర్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు క్రీజులో ఉంటే స్కోరు వేగం పరుగులు తీస్తుందని అభిప్రాయపడ్డాడు.

రవిశాస్త్రీ
రవిశాస్త్రీ (PTI)

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎంతో మంది యువ ఆటగాళ్లకు కలిసొచ్చింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ ప్లేయర్లు రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్‌లకు టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే ఉమ్రాన్ మాలిక్‌ను సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేయగా.. రాహుల్ త్రిపాఠిని ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో రాహుల్ త్రిపాఠి ప్రదర్శనపై మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ కూడా చేరారు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే.. స్కోరు వేగం పెరుగుతుందని జోస్యం చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

"అతడు(రాహుల్ త్రిపాఠి) క్రీజులో ఉన్నప్పుడు స్కోరు బోర్డు వేగంగా కదులుతుంది. అతడు బంతి వెనకు పరుగులు తీయాల్సినే పని లేకుండానే రన్స్ వస్తాయి. అతడి షాట్ మేకింగ్ నైపుణ్యంతో ఆల్ రౌండ్ గేమ్‌ను కలిగి ఉన్నాడు. అతడు ఎలాంటి ప్రత్యర్థినైనా సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అద్భుతంగా పరుగులు రాబట్టగలడు." అని రవిశాస్త్రీ.. రాహుల్ త్రిపాఠి గురించి అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్2022లో రాహుల్ త్రిపాఠి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 14 మ్యాచ్‌ల్లో 413 పరుగులతో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక పరుగులు చేసినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ పరంగా అతడు మంచి ఫామ్‌లో ఉన్నప్పుటికీ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.

త్వరలో ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేసినందుకు అతడు ఆనందం వ్యక్తం చేశాడు. ఇది చాలా పెద్ద అవకాశమని, తన కల నిజమైందని సంతోషపడ్డాడు. "సెలక్టర్లు ప్రతి ఒక్కరూ నన్ను విశ్వసించినందుకు, నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినందుకు ఆనందంగా ఉంది. నాకు తుది జట్టులో ఆడేందుకు అవకాశమొస్తే నా వంతు కృషి చేస్తాను అని రాహుల్ త్రిపాఠి స్పష్టం చేశాడు.

ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా.. భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ కూడా ఈ జట్టులో ఉన్నారు. జూన్ 26, 28న వరుసగా డబ్లిన్ వేదికగా భారత్‌తో ఐర్లాండ్ రెండు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్