Netizens Troll on Bharat: భ‌ర‌త్ కంటే డెబ్యూ వికెట్ కీప‌ర్ బెస్ట్‌ - ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు-netizens troll on ks bharat wicket keeping in 4th test
Telugu News  /  Sports  /  Netizens Troll On Ks Bharat Wicket Keeping In 4th Test
భ‌ర‌త్‌
భ‌ర‌త్‌

Netizens Troll on Bharat: భ‌ర‌త్ కంటే డెబ్యూ వికెట్ కీప‌ర్ బెస్ట్‌ - ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

09 March 2023, 11:19 ISTNelki Naresh Kumar
09 March 2023, 11:19 IST

Netizens Troll on Bharat: నాలుగో టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ సింపుల్ క్యాచ్‌ను ప‌ట్ట‌లేక‌పోయిన వికెట్ కీప‌ర్ భ‌ర‌త్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు.

Netizens Troll on Bharat: నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేసిన వికెట్ కీప‌ర్ భ‌ర‌త్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. వ‌ర‌స్ట్ వికెట్ కీప‌ర్ అంటూ అత‌డిని పేర్కొంటున్నారు. ఇన్నింగ్స్ ఆరో ఓవ‌ర్‌లో ఉమేష్ యాద‌వ్ బౌలింగ్‌లో ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ ఇచ్చిన చాలా సింపుల్ క్యాచ్‌ను భ‌ర‌త్ మిస్ చేశాడు. డైరెక్ట్‌గా చేతుల్లోకి వ‌చ్చిన క్యాచ్‌ను ప‌ట్టుకోలేక‌పోయాడు. అత‌డు క్యాచ్ మిస్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ ప్రారంభ‌మైన ఏడు ఓవ‌ర్ల‌లోనే ఎనిమిది బైస్ ప‌రుగులు ఇవ్వ‌డం కూడా విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

సింపుల్ క్యాచ్ ప‌ట్ట‌లేక విఫ‌ల‌మైన భ‌ర‌త్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. బిలో యావ‌రేజ్ వికెట్ కీప‌ర్ అంటూ భ‌ర‌త్‌ను పేర్కొంటున్నారు. డెబ్యూ వికెట్ కీప‌ర్ అత‌డికంటే బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. భ‌ర‌త్ స్థానంలో ఇషాన్ కిష‌న్‌ను ఎంపిక‌చేయ‌కుండా టీమ్ మేనేజ్‌మెంట్‌ త‌ప్పుచేసిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. భ‌ర‌త్ కంటే పంత్ ఎన్నో రెట్లుబెస్ట్ అంటూ చెబుతున్నారు.

రోడ్డు ప్ర‌మాదంలో రిష‌బ్ పంత్ గాయ‌ప‌డటంతో అత‌డి స్థానంలో కేఎస్ భ‌ర‌త్ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌కు ఎంపిక‌య్యాడు. కానీ త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని పూర్తిస్థాయిలో స‌ద్వినియోగం చేసుకోలేక‌పోతున్నాడు. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్ ప‌రంగా పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి కేవ‌లం 57 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.