Ganguly Warns Shoaib Malik: షోయ‌బ్ మాలిక్‌కు గంగూలీ స్ట్రాంగ్ వార్నింగ్ - రివీల్ చేసిన క‌మ్రాన్ అక్మ‌ల్ -kamran akmal reveals war of words between sourav ganguly and shoaib malik ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Kamran Akmal Reveals War Of Words Between Sourav Ganguly And Shoaib Malik

Ganguly Warns Shoaib Malik: షోయ‌బ్ మాలిక్‌కు గంగూలీ స్ట్రాంగ్ వార్నింగ్ - రివీల్ చేసిన క‌మ్రాన్ అక్మ‌ల్

Nelki Naresh Kumar HT Telugu
Feb 25, 2023 10:46 AM IST

Ganguly Warns Shoaib Malik: 2005లో మొహాలీ వేదిక‌గా జ‌రిగిన టెస్ట్‌లో షోయ‌బ్ మాలిక్‌కు గంగూలీ వార్నింగ్ ఇచ్చాడ‌ని పాకిస్థాన్ మాజీ వికెట్ కీప‌ర్ క‌మ్రాన్ అక్మ‌ల్ పేర్కొన్నాడు.

 గంగూలీ
గంగూలీ

Ganguly Warns Shoaib Malik: క్రికెట్‌లో స్లెడ్జింగ్ కామ‌న్‌గా క‌నిపిస్తుంది. నిల‌కడ‌గా ఆడుతోన్న బ్యాట్స్‌మెన్స్ దృష్టిమ‌ర‌ల్చ‌డానికి స్లెడ్జింగ్‌ను ఆయుధంగా ఉప‌యోగిస్తుంటారు. ఇండియా, పాకిస్థాన్ లాంటి దేశాల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు మాట‌ల యుద్ధం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.

2005లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య మొహాలీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో గంగూలీ, షోయ‌బ్ మాలిక్‌కు మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న గురించి పాకిస్థాన్ మాజీ వికెట్ కీప‌ర్ క‌మ్రాన్ అక్మ‌ల్ ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్లడించాడు. షోయ‌బ్ మాలిక్ వేసిన ఎత్తుల‌కు ఔటైన గంగూలీ కోపంతో అత‌డికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన‌ట్లు క‌మ్రాన్ పేర్కొన్నాడు.

ఆ మ్యాచ్‌లో గంగూలీ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ క‌నిపించాడు. డానిష్ క‌నేరియా లెంగ్త్ మిస్ చేస్తూ వేసిన లూజ్ బాల్‌ను గంగూలీ ఫోర్ కొట్టాడ‌ని క‌మ్రాన్ అక్మ‌ల్ అన్నాడు.

ఆ స‌మ‌యంలో మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న షోయ‌బ్ మాలిక్…గంగూలీని స్లెడ్జ్ చేశాడు. గంగూలీ ఫ్రెజ‌ర్‌లో ఉన్నాడు. సిక్స్ కొట్ట‌బోయి ఫోర్ కొట్టాడు... అంటూ కావాల‌నే గ‌ట్టిగా నాతో అన్నాడు. షోయ‌బ్ మాట‌ల‌కు బ్యాట్ తోనే బ‌దులివ్వాల‌ని అనుకున్న గంగూలీ క్రీజు దాటుకుంటూ ముందుకొచ్చి సిక్స్ కొట్టే ప్ర‌య‌త్నం చేశాడు.

కానీ ఆ బాల్ మిస్ కావ‌డంతో స్టంపౌట్ అయ్యాడు. ఆ స‌మ‌యంలో పెవిలియ‌న్ వెళుతూ నువ్వు చాలా ముదురే. నిన్ను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు. స్టేడియం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత చూసుకుందాం అంటూ షోయ‌బ్ మాలిక్‌కు గంగూలీ వార్నింగ్ ఇచ్చాడ‌ని క‌మ్రాన్ అక్మ‌ల్ పేర్కొన్నాడు.

WhatsApp channel