Ravi Shastri on Kl rahul: వైస్ కెప్టెన్ ప‌ద‌వి అనవ‌స‌రం- ర‌విశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌-ind vs aus test series ravi shastri comments on vice captain role in team india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Aus Test Series Ravi Shastri Comments On Vice Captain Role In Team India

Ravi Shastri on Kl rahul: వైస్ కెప్టెన్ ప‌ద‌వి అనవ‌స‌రం- ర‌విశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 26, 2023 02:05 PM IST

Ravi Shastri on Kl rahul: గ‌త కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ప‌డుతోన్నాడు టీమ్ ఇండియా ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్‌. అత‌డిపై టీమ్ ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

కె.ఎల్ రాహుల్‌
కె.ఎల్ రాహుల్‌

Ravi Shastri on Kl rahul: కేఎల్ రాహుల్ ఫామ్‌పై గ‌త కొంత‌కాలంగా చాలా విమ‌ర్శ‌లు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన గ‌త‌ రెండు టెస్ట్‌ల్లో రాహుల్ కేవ‌లం 38 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు.

ఇన్నాళ్లు టెస్ట్‌ల‌తో పాటు వ‌న్డేల్లో వైస్ కెప్టెన్‌గా కొన‌సాగాడు కె.ఎల్ రాహుల్‌. కానీ మిగ‌తా రెండు టెస్ట్‌ల‌కు అత‌డిని వైస్ కెప్టెన్ ప‌ద‌వి నుంచి త‌ప్పించిన టీమ్ మేనేజ్‌మెంట్ కేవ‌లం ఓపెన‌ర్‌గానే ఆడించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది.

ఈ నేప‌థ్యంలో కె.ఎల్ రాహుల్ ఫామ్‌పై టీమ్ ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. అత‌డు మాట్లాడుతూ స్వ‌దేశంలో జ‌రిగే సిరీస్‌ల‌లో వైస్ కెప్టెన్‌గా ఎవ‌రిని నియ‌మించ‌క‌పోవ‌డ‌మే మంచిదంటూ పేర్కొన్నారు.

కొన్నిసార్లు వైస్ కెప్టెన్ అనే ట్యాగ్ వ‌ల్లే ప్లేయ‌ర్స్‌ జ‌ట్టులో కొన‌సాగించాల్సివ‌స్తుంటుంద‌ని, ఆ ట్యాగ్ లేక‌పోతే అత‌డి స్థానంలో ఎవ‌రినైనా ఆడించ‌డం సుల‌భ‌మ‌వుతుంద‌ని అన్నాడు ర‌విశాస్త్రి. వైస్ కెప్టెన్ లాంటి ప‌ద‌వుల కంటే ఆట‌గాళ్ల ఫామ్ ముఖ్య‌మ‌ని ర‌విశాస్త్రి చెప్పాడు.

రాహుల్ ఫామ్‌, అత‌డి స్టేట్ ఆఫ్ మైండ్ ఏమిటో టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలుసున‌ని ర‌విశాస్త్రి అన్నాడు. ఆట‌గాడిగా రాహుల్‌కు ఎంతో ప్ర‌తిభావంతుడైన అందుకు త‌గ్గ రిజ‌ల్ట్ అత‌డి నుంచి రావ‌డం లేద‌ని పేర్కొన్నాడు.

అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోన్న ఎంతో మంది ప్ర‌తిభ‌వంతులైన ఆట‌గాళ్లు ఇండియాలో ఉన్నారు. అలాంట‌ప్పుడు ఫామ్‌లో లేని ఆట‌గాడి కంటే గిల్ లాంటి ప్ర‌త్యామ్నాయ ప్లేయ‌ర్స్ పై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టిపెడితే మంచిద‌ని ర‌విశాస్త్రి పేర్కొన్నాడు.

WhatsApp channel