Footballer Dies of lightning: షాకింగ్ వీడియో.. పిడుగు పడి ఫీల్డ్‌లోనే కుప్పకూలిన ఫుట్‌బాలర్-footballer dies of lightning on field shocking video gone viral telugu sports news ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Footballer Dies Of Lightning: షాకింగ్ వీడియో.. పిడుగు పడి ఫీల్డ్‌లోనే కుప్పకూలిన ఫుట్‌బాలర్

Footballer Dies of lightning: షాకింగ్ వీడియో.. పిడుగు పడి ఫీల్డ్‌లోనే కుప్పకూలిన ఫుట్‌బాలర్

Hari Prasad S HT Telugu
Feb 13, 2024 07:53 AM IST

Footballer Dies of lightning: ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగానే పిడుగు పడి ఓ ప్లేయర్ మృత్యువాత పడిన దారుణమైన ఘటన ఇండోనేషియాలో జరిగింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ గా మారింది.

ఫుట్‌బాల్ ఫీల్డ్ లోనే ప్లేయర్ పై పిడుగు పడుతుండటం ఇందులో చూడొచ్చు
ఫుట్‌బాల్ ఫీల్డ్ లోనే ప్లేయర్ పై పిడుగు పడుతుండటం ఇందులో చూడొచ్చు (Screengrab)

Footballer Dies of lightning: ఇప్పుడో షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పిడుగు పడి ఓ ప్లేయర్ చనిపోయాడు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. సదరు ప్లేయర్ పై పిడుగు పడిన వీడియో వైరల్ అయింది. పిడుగు పడిన తర్వాత కూడా అతడు ఊపిరి తీసుకుంటూనే ఉన్నాడని, హాస్పిటల్ చేరేలోపే చనిపోయినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం

ఫుట్‌బాలర్ ఇలా పిడుగు పడి చనిపోవడం అనేది అసాధారణమైన ఘటనే. ఇండోనేషియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఓ ప్లేయర్ పై పిడుగు పడింది అంటూ ఓ యూజర్ సోషల్ మీడియా ఎక్స్ లో ఈ వీడియో షేర్ చేశాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆ ప్లేయర్ అటూ ఇటూ కదలడం వీడియోలో చూడొచ్చు. సరిగ్గా అతడు వెళ్లిన ప్లేస్ లోనే పిడుగు పడింది.

ఆ వెంటనే పక్కనే ఉన్న ప్లేయర్స్ అందరూ పరుగెత్తుకుంటూ ఆ ప్లేయర్ దగ్గరికి వెళ్లారు. ఇండోనేషియాలోని బన్‌డంగ్ లో ఉన్న సిలివాంగి స్టేడియంలో ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈ విషాదకర ఘటన జరిగింది. పిడుగు పడిన తర్వాత సదరు ఫుట్‌బాలర్ వేసుకున్న జెర్సీపై కాలిన మరకలు ఉన్నట్లు స్టేడియంలోనే ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఫుట్‌బాల్ మ్యాచ్ సమయంలోనే వర్షం

ఇండోనేషియాలో ఈ మ్యాచ్ ఫిబ్రవరి 10వ తేదీన జరిగింది. ఆ సమయంలోనే వర్షం మొదలైంది. మరీ భారీ వర్షం కురవకపోయినా.. హఠాత్తుగా ఇలా పిడుగు పడటం అందరినీ షాక్ కు గురి చేసింది. ప్లేయర్ పై పిడుగు పడటం, అతడం కుప్పకూలడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే అతన్ని ఇతర ప్లేయర్స్ దగ్గర్లో ఉన్న సరినింగ్సి హాస్పిటల్ కు తరలించారు.

అయితే అక్కడికి వెళ్లే లోపే అతడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. సాధారణంగా చెట్లపై పిడుగు పడటం మనం చూస్తుంటాం. అయితే అప్పుడప్పుడూ ఇలా ఖాళీ ప్రాంతాల్లోనూ పడుతుంది. ఈ సందర్భంలో ప్లేయర్ పై నేరుగా పడటంతో కరెంట్ షాక్ వచ్చినట్లుగా అలాంటి వ్యక్తులు గుండె పోటుకు గురవుతారు. ఫుట్‌బాలర్ ఫీల్డ్ లో మ్యాచ్ జరుగుతుండగానే ఇలా పిడుగు పడి చనిపోవడం మాత్రం అత్యంత అరుదైన ఘటనగా చెప్పొచ్చు.

WhatsApp channel

టాపిక్