CWG 2022 Day 11 India Schedule: కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే
కామన్వెల్త్ గేమ్స్ లో పదో రోజు ఇండియా బాక్సర్లు, బ్మాడ్మింటన్ ప్లేయర్స్ పతకాల పంట పడించారు. మొత్తం 55 మెడల్స్ తో ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 11వ రోజు బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు, లక్ష్యసేన్, టేబుల్ టెన్నిస్ లో ఆచంట శరత్ కమల్, హాకీలో మెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ పోరు కోసం సిద్ధమయ్యారు. నేటి మ్యాచ్ ల వివరాలు ఇవే...
పీవీ సింధు (twitter)
కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే
బ్యాడ్మింటన్
ఉమెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.20)
పీవీ సింధు
మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 2.10 )
లక్ష్య సేన్
మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3 గంటలకు)
సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టి
హాకీ సాయంత్రం (5 గంటల నుంచి ప్రారంభం)
మెన్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
టేబుల్ టెన్నిస్
మెన్స్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35)
జి.సత్యన్
మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ సాయంత్రం 4.25
ఆచంట శరత్ కమల్