Lovlina Borgohain: లవ్లీనా కోచ్‌కు హోటెల్‌లో వసతి కల్పించాం.. బీఎఫ్ఐ స్పష్టత-bfi says already provided transport and accommodation at hotel to lovlina coach ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bfi Says Already Provided Transport And Accommodation At Hotel To Lovlina Coach

Lovlina Borgohain: లవ్లీనా కోచ్‌కు హోటెల్‌లో వసతి కల్పించాం.. బీఎఫ్ఐ స్పష్టత

Maragani Govardhan HT Telugu
Jul 26, 2022 08:26 AM IST

భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కోచ్ సంధ్యా గురుంగ్‌కు హోటెల్‌లో వసతి కల్పించినట్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ట్రైనింగ్ క్యాంపులో ఆమెను హాజరయ్యేలా చేసేందుకు ఐఓఏతో కలిసి మాట్లాడుతున్నట్లు తెలిపింది.

లవ్లీనా బోర్గోహైన్
లవ్లీనా బోర్గోహైన్ (PTI)

ఒలింపిక్స్ పతక విజేత, భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్.. అధికారులు తనను మానసికంగా హింసిస్తున్నారని ట్విటర్ వేదికగా సోమవారం నాడు సంచలన ఆరోపణలు విషయం తెలిసిందే. తన కోచ్‌లను కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్న విలేజ్‌కు రానివ్వడం లేదని, ఓ కోచ్‌ను భారత్‌కు పంపించేశారని ఆరోపించింది. అయితే ఈ విషయంపై భారత బాక్సింగ్ ఫెడరేషన్(BFI) స్పందించింది. లవ్లీనా కోచ్ సంధ్యా గురుంగ్‌కు రవాణా, హోటెల్‌లో వసతి కల్పించినట్లు స్పష్టం చేసింది.సంధ్యా గురుంగ్ ట్రైనింగ్ క్యాంపస్‌లో హాజరయ్యేలా చేస్తామని, భారత ఒలింపిక్ సంఘంతో మాట్లాడి బర్మింగ్హమ్ జట్టులో భాగమమవుతారని నిర్ధారించింది.

"సంధ్యా గురుంగ్‌ను ఐర్లాండ్‌లోని శిక్షణా శిభిరంలో ఉండేలా భారత బాక్సింగ్ ఫెడరేషన్ చూసుకుంటుంది. భారత ఒలింపిక్ సంఘంతో కలిసి ‌బీఎఫ్‌ఐ సన్నిహితంగా పనిచేస్తోంది. తద్వారా సంధ్యాను బర్మింగ్హామ్మ జట్టులో భాగమయ్యేలా చేస్తాం. ఈ లోపు ఈటీఓ హోటెల్‌లో సంధ్యా గురుంగ్‌కు రవాణా, వసతిని కల్పించాం. ఇప్పటికే ఆమె అక్కడ ఉన్నారు" అని బీఎఫ్ఐ తన ప్రకటనలో పేర్కొంది.

క్రీడాకారులతో పాటు సహాయక సిబ్బంది ఎంతమంది ఉండవచ్చనే విషయాన్ని బీఎఫ్ఐ వివరించింది. "గేమ్స్‌లో ఆడే బృందంలో కేవలం 33 శాతం మంది మాత్రమే సహాయక సిబ్బందిని అనుమతిస్తారు. బీఎఫ్ఐ విషయంలో 12 మంది బాక్సర్ల(8 మంది పురుషులు, 4గురు స్త్రీలు)కు కోచ్‌లో తలిసి నలుగురు సహాయక సిబ్బంది ఉన్నారు, వీరే జట్టుతో కలిసి బర్మింగ్హామ్‌కు ప్రయాణిస్తారు" అని బీఎఫ్ఐ తెలిపింది.

కామన్వెల్త్ విలేజ్‌కు తన కోచ్‌లో ఒకరి ప్రవేశానికి నిరాకరించారని, మరోకరిని ఇండియాకు పంపించేశారని భారత బాక్సర్ లవ్లీనా ట్విటర్ వేదికగా సోమవారం ఆరోపణలు చేశారు. "నన్ను హింసిస్తున్నారని ఇవాళ చాలా బాధతో చెబుతున్నాను. నేను ఒలింపిక్‌ మెడల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన కోచ్‌లను తొలగించారు. దీంతో నా ట్రైనింగ్‌ ప్రక్రియ దెబ్బతిన్నది. ఇద్దరు కోచ్‌లలో ఒకరైన సంధ్యా గురూంగ్జీ ద్రోణాచార్య అవార్డు గ్రహీత. నా ఇద్దరు కోచ్‌లను ట్రైనింగ్‌ క్యాంప్‌లో భాగం చేయాలని ఎంతో వేడుకున్న తర్వాతగానీ చేర్చలేదు. వాళ్లను చాలా ఆలస్యంగా చేర్చారు" అని లవ్లీనా ఆరోపించింది.

"ఈ ట్రైనింగ్‌ క్యాంప్‌లలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఇది నన్ను మానసికంగా హింసించింది. నా కోచ్‌ సంధ్యను ఒలింపిక్‌ విలేజ్‌లోకి రానివ్వడం లేదు. గేమ్స్‌కు 8 రోజుల ఉన్న సమయంలో నా ట్రైనింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. నా రెండో కోచ్‌ను ఇండియాకు తిరిగి పంపించేశారు. ఎంతో వేడుకున్నా కూడా నాకు ఈ మానసిక హింస తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గేమ్స్‌పై దృష్టి సారించలేకపోతున్నాను. ఈ రాజకీయాలను దాటి నా దేశానికి మెడల్‌ తీసుకురావాలని అనుకుంటున్నాను" అని లవ్లీనా చెప్పింది.

WhatsApp channel

సంబంధిత కథనం