India vs Bangladesh 2nd Test Day 3: కుప్పకూలిన బంగ్లా టాపార్డర్.. లంచ్ విరామానికి స్కోరు 71/4-bangladesh loss top order ad trail by 16 runs against india in 2nd test ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Bangladesh Loss Top Order Ad Trail By 16 Runs Against India In 2nd Test

India vs Bangladesh 2nd Test Day 3: కుప్పకూలిన బంగ్లా టాపార్డర్.. లంచ్ విరామానికి స్కోరు 71/4

భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు (AP)

India vs Bangladesh 2nd Test Day 3: ఢాకా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా టాపార్డర్ బ్యాటర్లను కోల్పోయింది. మూడో రోజు లంచ్ విరామానికి 4 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

India vs Bangladesh 2nd Test Day 3: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాపార్డర్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 314 పరుగులకు ఆలౌట్ కావడంతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది బంగ్లాదేశ్. ఓవర్ నైట్ స్కోరు 7/0 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు లంచ్ విరామానికి 4 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఓపెనర్ జకీర్ హసన్(39), లిటన్ దాస్(0) క్రీజులో ఉన్నారు. ఎన్నో అంచనాల నడుమ బ్యాటింగ్‌కు షకిబుల్, ముష్పీకర్ రహీమ్ వెంట వెంటనే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో అశ్విన్, సిరాజ్, ఉనాద్కట్, అక్షర్ పటేల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మూడో రోజు ఆట ప్రారంభంలోనే బంగ్లాదేశ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు భారత బౌలర్లు. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ నజ్ముల్ హొస్సేయిన్‌ను() ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. అనంతరం కాసేపటికే వన్డౌన్ బ్యాటర్ మొమినల్ హఖ్‌ను(5) మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో క్రీజులోకి కెప్టెన్ షకిబుల్ హసన్(13) వచ్చాడు. కాసేపు నిలకడగా ఆడినప్పటి5కీ ఉనాద్కట్‌ అతడికి పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలోనే ముష్ఫీకర్ రహీమ్‌ను(9) అక్షర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో లంచ్ విరామానికి బంగ్లా 70 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మూడో రోజు ఆట ప్రారంభంలో అశ్విన్ వికెట్‌తో మొదలైన పతనం లంచ్ విరామం వరకు జరుగుతూనే ఉంది. క్రీజులో పాతుకుపోయే లోపు బ్యాటర్లు పెవిలియన్ చేర్చారు భారత బౌలర్లు. ఓ పక్క బంగ్లాదేశ్ వరసుగా వికెట్లు కోల్పోతున్నప్పటీకీ.. ఆ జట్టు ఓపెనర్ జకీర్ హసన్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలిస్తూ అర్ధశతకం దిశగా వెళ్తున్నాడు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లీడ్‌ను అధిగమించాలంటే ఇంకో 16 పరుగులు చేయాల్సి ఉంది.

ఢాకా ఇంటర్నేషనల్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైంది. అనంతరం అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో నాలుగు వికెట్లతో బంగ్లా బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ తడబడింది. 91కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమంయలో రిషబ్ పంత్(93), శ్రేయాస్ అయ్యర్(87) అర్ధశతకాలతో ఆదుకుని టీమిండియా మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

సంబంధిత కథనం