IND vs AUS 2nd Odi Toss: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా - ఇండియా బ్యాటింగ్
IND vs AUS 2nd Odi Toss: విశాఖ వేదికగా ఇండియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో టీమ్ ఇండియా బరిలో దిగింది.
IND vs AUS 2nd Odi Toss: ఇండియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి వన్డేకు దూరమైన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డే తో తిరిగి జట్టులోకి చేరాడు.
రోహిత్ రావడంతో ఇషాన్ కిషన్ రెండో వన్డేకు దూరమైయ్యాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్ టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపికచేసింది.మరోవైపు ఆస్ట్రేలియా కూడా తుది జట్టులో ఒక మార్పు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో అలెక్స్ క్యారీ జట్టులోకి వచ్చాడు.
వర్షం ముప్పు పొంచి ఉండటంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
టీమ్ ఇండియా జట్టు ఇదే
శుభ్‌మన్‌గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జడేజా, హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సిరాజ్, షమీ, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్