Abdul Razzaq on Bumrah: మా షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా ఏమాత్రం పనికి రాడు.. అతడో బేబీ బౌలర్: పాక్ మాజీ ప్లేయర్-abdul razzaq on bumrah says shaheen afridi is way better tham him ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Abdul Razzaq On Bumrah Says Shaheen Afridi Is Way Better Tham Him

Abdul Razzaq on Bumrah: మా షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా ఏమాత్రం పనికి రాడు.. అతడో బేబీ బౌలర్: పాక్ మాజీ ప్లేయర్

Hari Prasad S HT Telugu
Jan 30, 2023 10:18 AM IST

Abdul Razzaq on Bumrah: మా షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా ఏమాత్రం పనికి రాడని, అతడో బేబీ బౌలర్ అంటూ పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడతని వ్యాఖ్యలు భారత అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

బుమ్రా, షాహీన్ అఫ్రిది
బుమ్రా, షాహీన్ అఫ్రిది

Abdul Razzaq on Bumrah: ప్రపంచంలోని గొప్ప పేస్ బౌలర్లలో ఇండియాకు చెందిన జస్‌ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది ముందుంటారు. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ తమదైన ముద్ర వేశారు. తమ టీమ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఈ ఇద్దరూ సిద్ధహస్తులే.

ప్రస్తుతం గాయాల కారణంగా ఈ ఇద్దరూ క్రికెట్ కు దూరంగా ఉన్నారు. గతేడాది ఆసియా కప్ తర్వాత బుమ్రా మళ్లీ ఇండియాకు ఆడలేదు. అతని సేవలను టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఎంతగానో మిస్ అయింది. ప్రపంచంలో ఎంత గొప్ప బ్యాటర్ ను అయినా తన పేస్ తో బోల్తా కొట్టించగలిగే సత్తా బుమ్రాకు ఉంది. కానీ అలాంటి బౌలర్ ను తీవ్రంగా అవమానించాడు పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్. అతడో బేబీ బౌలర్ అని అన్నాడు.

"బుమ్రా కంటే షాహీన్ అఫ్రిది చాలా చాలా మెరుగైన బౌలర్. షాహీన్ స్థాయికి బుమ్రా దరిదాపుల్లో కూడా లేడు" అని పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు కూడా అయిన రజాక్.. ఓ స్థానిక న్యూస్ ఛానెల్ తో అన్నాడు. నిజానికి బుమ్రాపై రజాక్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ అతన్ని ఓ బేబీ బౌలర్ అంటూ రజాక్ అవమానించాడు.

"నేను గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి గొప్ప బౌలర్లతో ఆడాను. అందువల్ల నా ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్. అతన్ని నేను సులువుగా డామినేట్ చేసి, అటాక్ చేసేవాడిని" అని రజాక్ అప్పట్లో క్రికెట్ పాకిస్థాన్ తో అన్నాడు. బుమ్రాపై రజాక్ పదేపదే ఇలాంటి కామెంట్స్ చేస్తుండటంపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

మరోవైపు బుమ్రా ఇంకా తన వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీలోనే సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్ కోసం తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన టీమ్ లోనూ అతనికి చోటు దక్కలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం