Today Horoscope : నేటి రాశిఫలాలు : ఉద్యోగంలో సమస్యలు, ఖర్చులు అధికంగా ఉంటాయి-today horoscope in telugu based on career and life for 17th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 17th September 2022

Today Horoscope : నేటి రాశిఫలాలు : ఉద్యోగంలో సమస్యలు, ఖర్చులు అధికంగా ఉంటాయి

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 17, 2022 05:30 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 17వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (17-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశిఫలం

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంది. ఖర్చు అధికంగా ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయండి.

వృషభ రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసికంగా కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు పెరుగుతాయి. మరింత శుభ ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించండి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము ఉంటాయి.

మిథున రాశిఫలం

ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. పిల్లల వలన ఇబ్బందులు వస్తాయి. మీ కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణమునందు ఖర్చులు అధికమగుతాయి. శుభ ఫలితాల కోసం శివరాధన చేయడం మంచిది. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది.

కర్కాటక రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమగును. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం శివరాధన చేయడం మంచిది. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది.

కన్య రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. ప్రయాణములు అధికమవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు అధికముగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ అవసరం. మరిన్ని శుభ ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించండి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము ఉంటాయి.

తుల రాశిఫలం

ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ధనలాభము కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సౌఖ్యము ఉంటుంది. సంతానము వలన సంతోషము కలుగును. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రుల సహాయం పొందుతారు. మరింత శుభ ఫలితాల కోసం శివరాధన చేయండి. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృశ్చిక రాశిఫలం

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. సోదరులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ధనలాభము కలుగును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. మరింత శుభ ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము ఉంటుంది.

ధనుస్సు రాశిఫలం

శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధు వియోగం ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. మరింత శుభ ఫలితాల కోసం శివరాధనలో పాల్గొనండి.

మకర రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. చికాకులు అధికముగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ చేయడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కుంభ రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారికి తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. ఉద్యోగమునందు సమస్యలు అధికమవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

మీనం రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్