Shani Margi: మకరరాశిలోకి శని.. అక్టోబరు 23 వరకు ఈ రాశుల వారికి లాభాలే.. లాభాలే!-shani margi 2022 good news for the people of shani dhaiya and shani sadesati from next month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Margi: మకరరాశిలోకి శని.. అక్టోబరు 23 వరకు ఈ రాశుల వారికి లాభాలే.. లాభాలే!

Shani Margi: మకరరాశిలోకి శని.. అక్టోబరు 23 వరకు ఈ రాశుల వారికి లాభాలే.. లాభాలే!

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 09:25 PM IST

Shani Retrograde in Capricorn 2022: శనిదేవుడు స్థితి బట్టి రాశులకు ఫలాలు ఉంటాయి. శనిదేవుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ఇది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది.

Shani Margi 2022:
Shani Margi 2022:

శని దేవుడు ప్రస్తుతం తిరోగమన (Shani Retrograde in Capricorn 2022) దశలో కదులుతున్నాడు. జూన్ 5 న శని దేవుడు మకరరాశిలోకి ప్రవేశించాడు .141 రోజులు తిరోగమనం భాగంగా శని గ్రహం 23 అక్టోబర్ 2022న పథ స్థితిలోకి వస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. శని దీర్ఘకాలం తిరోగమనంలో ఉన్నప్పుడు ఏ రాశి వారికి శుభ పలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ప్రస్తుతం శని మకరరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల మిథున, తుల రాశి వారికి శుభ పలితాలు కలగనున్నాయి. అదే సమయంలో కుంభ, ధనుస్సు, మకర రాశుల వారిపై శని సాడే సతి ప్రభావం ఉంటుంది. శని అక్టోబరు 23 వరకు ఇక్కడే సంచరిస్తుంది. జనవరి 17న తన స్వంత రాశిలో ప్రవేశించనుంది.

ఈ రాశుల వారికి మంచి ఫలితాలు -

శని మార్గంగా ఉండటం వల్ల కొన్ని రాశిచక్రాలపై మంచి ప్రభావం ఉంటుంది.వృషభ, కన్యా, ధనుస్సు రాశుల వారికి శని మార్గం శుభప్రదం అవుతుంది.ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.ప్రయాణానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయి.

మేషరాశి (Aries): శని దేవుడి తిరోగమనం వల్ల మేష రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టుబడి కలిసి వస్తుంది. కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. చేసే పనులకు ప్రశంసలు ఉంటాయి.

కర్కాటక రాశి (Cancer): కొత్త ఉద్యోగం పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు మెుండుగా ఉంటాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు వస్తాయి. పనులపై ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius): శని తిరోగమనంతో ధనుస్సు రాశివారికి ధనలాభాలు ఉంటాయి. రావాల్సిన డబ్బును తిరిగి పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. వ్యాపారం ద్వారా అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో విజయం సాధిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం