Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు పంచాక్షరి మంత్రం జపించాలి-horoscope today telugu rasi phalalu check astrological predictions for may 22 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today Telugu Rasi Phalalu Check Astrological Predictions For May 22, 2023

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు పంచాక్షరి మంత్రం జపించాలి

HT Telugu Desk HT Telugu
May 22, 2023 01:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 22.05.2023వ తేదీ కోసం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

నేటి రాశి ఫలాలు 22 మే 2023
నేటి రాశి ఫలాలు 22 మే 2023 (freepik)

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 22.05.2023వ తేదీ సోమవారం రోజు కోసం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: వైశాఖము వారం: సోమవారం, తిథి: శు. తదియ నక్షత్రం: మృగశిర

 

మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు

మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. మానసిక ఒత్తిళ్ళు కొంత అధికముగా ఉండును. ఉద్యోగ వ్యాపారాలయందు శ్రమ అధికముగా ఉండును. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉ ద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి వారికి శనియొక్క అనుకూల స్థితివలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.

వృషభరాశి వారికి నేటి రాశి ఫలాలు

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు పెరుగును. ఉ ద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలసి వచ్చును. వృషభరాశివారికి దశమమునందు శని ప్రభావంచేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి వారికి నేటి రాశి ఫలాలు

మిథునరాశివారికి ఈరోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పని ఒత్తిడి, శ్రమ అధికముగా ఉండును. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని సూచన. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథునరాశివారికి కలసివచ్చును. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటకరాశి వారికి నేటి రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయములయందు కుటుంబ వ్యవహారములయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము. కర్కాటకరాశివారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు

సింహరాశివారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ఆహ్లాదంగా ఉండెదరు. ఉద్యోగస్తులకు పని ప్రభావము అధికముగా ఉ ండును. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు అధికముగా జరుగు సూచన. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. ఆర్ధికమపరమైన నిర్ణయాలు అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైన సమయము. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యారాశి వారికి నేటి దిన ఫలాలు

కన్యారాశివారికి ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. పని ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు శ్రమ అధికము. ఉల్లాసముగా గడిపెదరు. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమస్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును. కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులారాశి వారికి నేటి దిన ఫలాలు

తులారాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికముగా ఉండును. వ్యాపారస్తులకు శ్రమ అధికము. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళుదరు. కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చికరాశి వారికి నేటి దిన ఫలాలు

వృశ్చికరాశి వారికి ఈరోజు మధ్యస్థంనుండి అనుకూల ఫలితాలున్నాయి. వృశ్చికరాశి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికముగా ఉ ండును. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి రోజు. శారీరక శ్రమ అధికముగా ఉండును. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూరాశి వారికి నేటి దిన ఫలాలు

ధనూరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆహ్లాదముగా గడిపెదరు. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకరరాశి వారికి నేటి దిన ఫలాలు

మకర రాశివారికి ఈరోజు అనుకూలముగా ఉన్నది. ఉద్యోగములో శ్రమ అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభరాశి వారికి నేటి దిన ఫలాలు

కుంభరాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు శ్రమ అధికముగా ఉండును. మనోధైర్యముతో ముందుకు వెళ్ళెదరు. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. కుంభరాశిరు వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి వారికి నేటి దిన ఫలాలు

మీనరాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. శారీరక శ్రమ అధికము. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఆరోగ్యము అనుకూలించును. ఖర్చులు చేయడానికి ఇవ్వడానికి కూడా అనుకూలంగా లేనటువంటి సమయము. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మథ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము. మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్: 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel