Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారు ఒక శుభవార్త వింటారు!-horoscope today in telugu check your zodiac sign prediction for may 24 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Check Your Zodiac Sign Prediction For May 24, 2023

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారు ఒక శుభవార్త వింటారు!

HT Telugu Desk HT Telugu
May 24, 2023 01:01 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మే 24, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu:
Horoscope Today in Telugu: (Freepik)

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలితములు (దిన ఫలితము) 24.05.2023

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టం వారం: బుధవారం, తిథి: శు. పంచమి నక్షత్రం : పునర్వసు

మేష రాశి :

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆర్ధిక విషయాలు అనుకూలించును. మేషరాశికి జన్మస్థానమునందు బుధ, గురు, రాహువుల మరియు వాక్ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. పనులు యందు ఆటంకములు, చికాకులు కలుగును. ఈరోజు మీరు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు కొబ్బరికాయ నివేదించడం బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి :

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలు కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఈరోజు శ్రీకృష్ణున్ని పూజించాలి. కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ముఖ్యమైన విషయాల కోసం ధనాన్ని సమయాన్ని వినియోగించెదరు. శుభవార్త విను సూచన. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథున రాశి వారికి కలసివచ్చును. మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. ఖర్చులు అధికమగును. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. కుటుంబ విషయాల యందు జాగ్రత్త వహించాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలున్నాయి. ప్రయాణాలు కార్యక్రమాలు అనుకూలించును. ఉత్సాహముగా ఉండెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశివారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఈరోజు మీరు మరింత శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు కొబ్బరికాయ నివేదించడం బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కన్య రాశి :

ఈరోజు మీకు అనుకూలించును. వ్యాపారస్తులకు అనుకూలం. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబ విషయాలు అనుకూలించును. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. ఈరోజు శ్రీకృష్ణున్ని పూజించాలి. కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి :

ఈరోజు మీకు మధ్యస్థమునుండి అనుకూల ప్రభావాలున్నాయి. రాజకీయ ప్రభావము ఉద్యోగస్తుల మీద అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అనుకూల ఫలితములు. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళుదరు. స్త్రీలకు ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి :

ఈరోజు మీకు అంత అనుకూలముగా లేదు. పని ఒత్తిడి రాజకీయ ఒత్తిడి అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ విషయాల యందు జాగ్రత్త వహించాలి. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి :

ఈరోజు మీకు మధ్యస్థము నుండి చెడు ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితము. వ్యాపారస్తులకు చెడు ఫలితముగా ఉన్నది. ధనూరాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు ఈరోజు అనుకూలించును. ఈరోజు మీరు మరింత శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు కొబ్బరికాయ నివేదించడం బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి :

ఈరోజు మీకు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికము. స్త్రీలకు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. అష్టమ కుజుని ప్రభావంచేత కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడు సూచన. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఈరోజు శ్రీకృష్ణున్ని పూజించాలి. కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి :

ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలించును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలము. స్త్రీలకు ఈరోజు అనుకూలముగా ఉన్నది. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరో స్థానమునందు కుజుడు ఐదో స్థానమునందు శుక్రుడు తృతీయ స్థానమునందు రాహువు అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

మీన రాశి :

ఈరోజు మీకు అంత అనుకూలముగా లేదు. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు వ్యాపారంలో సమస్యలు అధికముగా ఉండును. స్త్రీలు ఈరోజు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావం మరియు వాక్ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ సమయము. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం