Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు మానసిక వేదన కలుగును!-horoscope today in telugu check astrological prediction for may 25 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Check Astrological Prediction For May 25, 2023

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు మానసిక వేదన కలుగును!

HT Telugu Desk HT Telugu
May 25, 2023 01:00 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మే 25, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu
Horoscope Today in Telugu (Stock Photo)

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలితము) 25.05.2023

సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టము, వారం: గురువారం, తిథి: శు. షష్ఠి నక్షత్రం: పుష్యమి

మేష రాశి :

ఈరోజు మేషరాశివారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. గొడవల వలన చికాకులు కలుగు సూచన. వ్యవహారాలయందు ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. మేషరాశి వారికి శనియొక్క అనుకూల స్థితివలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి :

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనుల కోసం ధనమును ఖర్చు చేసెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వృషభరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి :

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఖర్చులు అధికమగు సూచన. కుటుంబ విషయాల యందు వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథున రాశివారికి కలసివచ్చును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటక రాశి :

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. రాజకీయాలకు దూరంగా ఉండండి. ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగు సూచన. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. శివపార్వతులు అర్థానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ఆహ్లాదముగా గడిపెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశివారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్య రాశి :

ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యవహారముల యందు జాగ్రత్తలు వహించాలి. పనుల్లో ఆటంకములు చికాకులు కలుగు సూచన. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులా రాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. అనుకున్న అనేక కార్యక్రమాలు పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులు శుభవార్త వినెదరు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీ గురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. దైవ దర్శనము లాభించును. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. శుభఫలితాలు కలుగు సూచన. అష్టమ కుజుని ప్రభావంచేత కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడు సూచన. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు అనుకూలము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమస్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. శివపార్వతులు అర్థానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రాజకీయ ఒత్తిళ్ళు, చికాకులు అధికముగా ఉండును. కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఆలయదర్శనం చేయడం మంచిది. ఆరో స్థానమునందు కుజుడు ఐదో స్థానమునందు శుక్రుడు తృతీయ స్థానమునందు రాహువు అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనులు యందు ఒత్తిళ్ళు ఏర్పడును. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఆవేశం తగ్గించుకోవాలని సూచన. ఏలినాటి శని ప్రభావం మరియు వాక్ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం