Why Investors leaving Markets:స్టాక్ మార్కెట్ ను వీడుతున్న లక్షలాది ఇన్వెస్టర్లు-why investors leaving markets are investors losing faith in stock markets
Telugu News  /  Business  /  Why Investors Leaving Markets: Are Investors Losing Faith In Stock Markets?
 ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Why Investors leaving Markets:స్టాక్ మార్కెట్ ను వీడుతున్న లక్షలాది ఇన్వెస్టర్లు

04 March 2023, 16:16 ISTSudarshan Vaddanam
04 March 2023, 16:16 IST

కొరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రముఖ కంపెనీల షేర్లు కూడా అత్యల్ప స్థాయికి చేరాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్లోకి ‘లాక్ డౌన్ ట్రేడర్స్(Lockdown traders)’ దూసుకువచ్చారు.

కొరోనా (corona) మహమ్మారిపై మానవాళి విజయం ఖాయమవుతున్న సందర్భంలో చోటు చేసుకున్న మరో అంశం.. స్టాక్ మార్కెట్లో (stock market) కి వెల్లువగా తరలివచ్చిన మధ్యతరగతి ప్రజలు. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, చదువులు ముగించుకుని ఉద్యోగాల్లో చేరుతున్న యువతీయువకులు భారీగా స్టాక్ మార్కెట్ ను ఎక్స్ ప్లోర్ చేయడం ప్రారంభించారు. కొన్ని నెలల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో కొత్త డీమ్యాట్ (demat accounts) ఖాతాలు ఓపెన్ అయ్యాయి. బ్రోకరేజ్ సంస్థలు, స్టాక్ అగ్రిగేటర్లు భారీగా లాభాలు చేసుకున్నారు.

Why Investors leaving Markets?: ట్రెండ్ మారుతోందా?

అయితే, ఇప్పుడు తాజాగా ఆ ట్రెండ్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కమ్ముకొస్తున్న ఆర్థిక మాంద్యం (recession), ఉద్యోగాల కోత (lay offs) నేపథ్యంలో జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, ద్రవ్యోల్బణం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ధరల పెరుగుదల.. వీటన్నింటికి తోడు ఇటీవల ఆదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ (Adani Hindenberg row) వేసిన ఆర్థిక అవకతవకల ఆరోపణల బాంబు.. ఇవన్నీ కలసికట్టుగా స్టాక్ మార్కెట్ నుంచి వలసలు ప్రారంభం కావడానికి కారణమయ్యాయి. వీటన్నింటి కారణంగా మార్కెట్ తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు లోనవ్వడం, స్టాక్స్ లో భారీగా హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం.. ఇవన్నీ సగటు ఇన్వెస్టర్ కు మార్కెట్ (STOCK MARKET) పై విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి. దాంతో, చాలా మంది క్రమంగా, మార్కెట్ కు దూరమవుతున్నారు. 'లాభమో, నష్టమో.. ఉన్న స్టాక్స్ ను అమ్మేసుకుని ప్రశాంతంగా ఉందా’మన్న ఆలోచన మదుపర్లలో ప్రారంభమైంది.

38 lakhs investors left stock market: 38 లక్షల మంది..

గత ఆరు నెలల్లో భారతీయ స్టాక్ మార్కెట్ల (STOCK MARKET) కు కనీసం 38 లక్షల మంది ఇన్వెస్టర్లు దూరమయ్యారని సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ఆశిష్ బహెతీ (Ashish Bahety) వెల్లడించారు. ఎన్ఎస్ఈ (NSE) డేటా ఆధారంగా ఆయన ఆ వివరాలను నివేదించారు. ‘లాక్ డౌన్ (lockdown) సమయంలో మార్కెట్లోకి వెల్లువలా వచ్చినవారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ (STOCK MARKET) అసలు రూపాన్ని చూస్తున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమ వద్ద కొత్తగా ట్రేడింగ్ ఖాతాలను ఓపెన్ చేసేవారి సంఖ్య 50% తగ్గిపోయిందని జిరోధా (Zerodha) ఫౌండర్ సీఈఓ నితిన్ కామత్ వెల్లడించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఈ ట్రెండ్ మరింత పెరిగిందన్నారు. ఎన్ఎస్ఈ (NSE) డేటా ప్రకారం రోజువారీ ట్రేడింగ్ టర్నోవర్ 2022 నవంబర్ లో రూ. 57,196 కోట్లు కాగా, అది 2022 డిసెంబర్ లో రూ. 52,766 కోట్లకు, 2023 జనవరిలో రూ. 48,601 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, బీఎస్ఈ లో సెప్టెంబర్ 2022 లో టోటల్ ఈక్విటీ టర్నోవర్ (total turnover of equity) రూ. 1,18,132.64 కోట్లు కాగా, అది జనవరి 2023 లో రూ. 68,103.37 కోట్లకు తగ్గింది.

Investors losing hope: విశ్వాసం కోల్పోతున్నారు..

ఇన్వెస్టర్లు మార్కెట్ (STOCK MARKET) కు దూరం కావడం, కొత్త మదుపర్లు మార్కెట్లోకి రాకపోవడం, ఉన్న ఇన్వెస్టర్లు కూడా ట్రేడింగ్ కు దూరంగా ఉండడం.. ఇవన్నీ మదుపర్లు మార్కెట్ (stock market) పై విశ్వాసం కోల్పోయారనడానికి స్పష్టమైన ఉదాహరణలని టర్టిల్ వెల్త్ (Turtle Wealth) సీఈఓ రోహన్ మెహతా విశ్లేషించారు. అలాగే, మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న కరెక్షన్ కు నాలుగా కారణాలున్నాయని ఆయన వివరించారు.‘‘ఒకటి, కంపెనీల త్రైమాసిక ఫలితాలు (quarterly results) ఆశించిన స్థాయిలో లేకపోవడం.. రెండోది ఇండియన్ మార్కెట్ కొంతమేరకు ఓవర్ వ్యాల్యూడ్ కావడం.. మూడోది ఆదానీ హిండెన్ బర్గ్ అంశం (Adani Hindenberg row).. నాలుగోది ప్రపంచవ్యాప్తంగానే మాంద్యం నెలకొనడం’’ అని మెహతా విశ్లేషించారు.