WhatsApp tricks: వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ ఫొటోస్ ను ఇలా పంపించొచ్చు..-whatsapp tricks to send photos in original quality on dm ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Whatsapp Tricks To Send Photos In 'Original Quality' On Dm

WhatsApp tricks: వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ ఫొటోస్ ను ఇలా పంపించొచ్చు..

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 05:57 PM IST

WhatsApp tricks: వాట్సాప్ లో ఫొటోలను షేర్ చేస్తున్న సమయంలో ఆ ఫొటోల క్వాలిటీ తగ్గుతోందన్న ఫిర్యాదులపై వాట్సాప్ (WhatsApp) స్పందించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

WhatsApp tricks: ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలను షేర్ చేసే వీలు కలిగేలా ఒక తాజా అప్ డేట్ ను వాట్సాప్ (WhatsApp) ఇంట్రడ్యూస్ చేసింది. ఎప్పటికప్పుడు యూజర్లకు నాణ్యమైన సేవలను అందించే కృషిలో భాగంగానే కొత్త ఫీచర ను అందుబాటులోకి తీసుకువచ్చామని వాట్సాప్ (WhatsApp) యాజమాన్య సంస్థ మెటా (Meta) వెల్లడించింది. ఇప్పటికే ఐఫోన్ (iPhone) యూజర్లకు సెర్చ్ మెసేజెస్ బై డేట్ (search messages by date)’ ఫీచర్ ను, ఆండ్రాయిడ్ టాబ్ యూజర్లకు స్ప్లిట్ వ్యూ ఆప్షన్ (split view option) ను వట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

WhatsApp tricks: ఫొటో క్వాలిటీ..

వాట్సాప్ లో షేర్ చేస్తున్న ఫొటోల క్వాలిటీకి సంబంధించి యూజర్ల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఫొటోలు కంప్రెస్ అవుతున్నాయని, దాంతో బ్లర్ గా కనిపిస్తున్నాయని యూజర్లు వాపోయారు. దాంతో, ఈ సమస్యపై దృష్టి పెట్టిన వాట్సాప్ కొత్త ఫీచర్ ను రూపొందించింది. వాట్సాప్ ప్లాట్ ఫామ్ పై షేర్ చేసే ఫొటోలు ఒరిజినల్ క్వాలిటీ లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. బెస్ట్ క్వాలిటీ ఫోటోను షేర్ చేయాలనుకునే యూజర్… అందుకు అనుగుణంగా, మీడియా అప్ లోడ్ క్వాలిటీ ని సెలెక్ట్ చేసుకోవాలి..

WhatsApp tricks: బెస్ట్ ఫొటో క్వాలిటీ కోసం..

  • లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్ ఫోన్ లో ఉండాలి.
  • ఫోన్ లో యాప్ ను ఓపెన్ చేసిన తరువాత కుడివైపు పైన ఉన్న త్రీ డాట్స్ (three-dot menu) ను టచ్ చేయాలి.
  • డ్రాప్ డౌన్ మెనూలో నుంచి సెట్టింగ్స్ (Settings) ఓపెన్ చేయాలి. అక్కడ స్టోరేజ్ అండ్ డేటా()Storage and data ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • అక్కడే మీడియా అప్ లోడ్ క్వాలిటీ (Media upload quality) సెక్షన్ లో ఫొటో అప్ లోడ్ క్వాలిటీ (Photo upload quality) ని చెక్ చేసుకోవాలి.
  • అక్కడ కనిపించే మూడు ఆప్షన్లలో ఒక దానికి ఎంచుకుని ఓకే ప్రెస్ చేయాలి.
  • ఆ మూడు ఆప్షన్లు .. 1) ఆటో (Auto) 2) బెస్ట్ క్వాలిటీ (Best quality) 3) డేటా సేవర్ (Data saver).
  • తమ ఫొటోలు ఏ క్వాలిటీ పంపించాలనే విషయంలో నిర్ణయం తీసుకుని, అందుకు అనువైన ఆప్షన్ ను యూజర్ ఎంచుకోవచ్చు.
  • ఆటో (Auto) ఆప్షన్ లో వైఫై అందుబాటులో ఉన్నప్పుడు హై క్వాలిటీ ఫొటోలను బై డీఫాల్ట్ గా పంపించడం వీలవుతుంది.

WhatsApp tricks: మరికొన్ని అప్ డేట్స్..

ఇవి కాకుండా, స్టేటస్ అప్ డేట్ రిపోర్టింగ్ (status update reporting), ప్రైవేట్ న్యూస్ లెటర్(private newsletter), మెసేజ్ ఎడిటింగ్ (message editing) ఫీచర్లను త్వరలో తీసుకురానుంది.

WhatsApp channel

టాపిక్