Realme C55: ఐ ఫోన్ ఫీచర్ తో రియల్ మి సీ 55; ధర ఎంతో తెలుసా?
Realme C55: రియల్ మి సీ 55 (Realme C55) భారత్ మార్కెట్లో విడుదలైంది. ఐ ఫోన్ లో ఉండే డైనమిక్ ఐలాండ్ ఇంటర్ ఫేస్ (Dynamic Island interface) వంటి మిని క్యాప్సూల్ (Mini Capsule) ఫీచర్ ఈ ఫోన్ లోని స్పెషాలిటీ.
Realme C55: భారత్ మార్కెట్లో తాజాగా విడుదలైన రియల్ మి సీ 55 (Realme C55) లో అడ్వాన్స్డ్ ఫీచర్లను అఫర్డబుల్ ధరలో అందిస్తున్నారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ 88 ఎస్ఓసీ (MediaTek Helio G88 SoC) ప్రాసెసర్ ను, LPDDR4X ర్యామ్ ను, 1 టీబీ (1TB) వరకు ఎక్స్ పాండ్ చేసుకోగల మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్ (microSD card slot) ను పొందుపర్చారు.
Realme C55: ఐ ఫోన్ ఫీచర్..
యాపిల్ ఐ ఫోన్ (iPhone) లో ఉండే Dynamic Island interface తరహాలో ఈ రియల్ మి సీ 55 (Realme C55) లో మినీ క్యాప్సూల్ (Mini Capsule) ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ తో బ్యాటరీ, స్టెప్ కౌంట్, డేటా వినియోగం మొదలైన వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి, రియల్ మి ల్యాబ్స్ ను, అనంతరం మిని క్యాప్సూల్ (Mini Capsule) ను క్లిక్ చేయాలి. ఈ ఫోన్ ను అత్యంత అడ్వాన్స్డ్ ఫీచర్లతో, చవకైన ధరలో వినియోగదారులకు అందిస్తున్నారు.
Realme C55: మార్చి 28 నుంచి..
ఈ రియల్ మీ సీ 55 (Realme C55) స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 28 నుంచి లభిస్తుంది. దీని ధర రూ. 10,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ (4 GB RAM), 64 జీబీ స్టోరేజ్ వర్షన్ ధర రూ. 10,999 కాగా, 6 జీబీ ర్యామ్ (6 GB RAM), 64 జీబీ స్టోరేజ్ వర్షన్ రూ. 11,999 లకు లభిస్తుంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ (8 GB RAM), 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 13,999 గా నిర్ణయించారు.
Realme C55: 5జీ ఫోన్ కాదు..
అయితే, ఇది (Realme C55) 5జీ ఫోన్ కాదు. ఇతర స్పెసిఫికేషన్ల వివరాలకు వెళ్తే, ఇది 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేతో వస్తోంది. ఫింగర్ ప్రింట్ రీడర్ సదుపాయం ఉంది. రియల్ మీ లో ఇప్పటివరకు వచ్చిన మోడల్స్ లో ఇదే అత్యంత స్లీక్ మోడల్. దీని బరువు కూడా 189.5 గ్రాములు మాత్రమే. ఇందులో (Realme C55) 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ రియల్ మీ యూఐ 4.0 (Realme UI 4.0) పై పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ స్పీడ్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.