Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఈ 5 మంత్రాలు జపించండి.. సంపద, శ్రేయస్సు, విజయం పొందుతారు-chant these five mantras on akshaya tritiya you will get prosperous life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఈ 5 మంత్రాలు జపించండి.. సంపద, శ్రేయస్సు, విజయం పొందుతారు

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఈ 5 మంత్రాలు జపించండి.. సంపద, శ్రేయస్సు, విజయం పొందుతారు

Gunti Soundarya HT Telugu
May 01, 2024 06:07 PM IST

Akshaya tritiya 2024: పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఈ ఐదు మాత్రాలు జపించండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి సంపద, శ్రేయస్సు, విజయం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

అక్షయ తృతీయ నాడు పఠించాల్సిన మంత్రాలు
అక్షయ తృతీయ నాడు పఠించాల్సిన మంత్రాలు

Akshaya tritiya 2024: కొత్త పనులు ప్రారంభించేందుకు, శుభకార్యాలు నిర్వహించేందుకు, బంగారం కొనేందుకు అద్భుతమైన రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. హిందూ శాస్త్రంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుం.ది ఈరోజు ఏ పని చేసిన శ్రేయస్సు, సమృద్ధి, ఆశీర్వాదం లభిస్తాయి.

అక్షయ తృతీయ రోజు చేపట్టే ఏ కార్యక్రమం అయినా అంతులేని శ్రేయస్సు, విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. పవిత్రమైన ఈరోజు కొన్ని మంత్రాలు పఠించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవి మీ జీవితంలోని అన్ని అంశాలలో సంపద, శ్రేయస్సు, సమృద్ధి, ఆశీర్వాదాలను ప్రేరేపిస్తాయి. అక్షయ తృతీయ మే 10వ తేదీన జరుపుకోనున్నారు. మీ జీవితంలో సమృద్ధి ఉండడం కోసం ఈ ఐదు శక్తివంతమైన మంత్రాలను జపించాలి.

గణేష్ మంత్రం

ఓం గణపతయే నమః

విఘ్నాలు తొలగించే వాడిగా వినాయకుడిని పూజిస్తారు. అందుకే పూజ చేసే ముందు తొలి పూజ వినాయకుడికి చేస్తారు. వినాయకుడిని పూజించి గణేశ మంత్రాన్ని పఠించడం వల్ల మీ శ్రేయస్సు, సమృద్ధికి ఆటంకం కలిగించే అడ్డంకులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. అదృష్టం మెరుగుపడుతుంది.

లక్ష్మీ మంత్రం

ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీ లక్ష్మీ నారాయణ నమః

లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, సమృద్ధిని ఇచ్చే దేవతగా కొలుస్తారు. అక్షయ తృతీయ నాడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఆదాయ వనరులు సమృద్ధిగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది.

కుబేర మంత్రం

ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ

ధనధాన్యాధిపతయే ధనధాన్యసమృద్ధి మే దేహి దాపయ స్వాహా

సంపదకు అధి దేవుడుగా కుబేరుడిని పరిగణిస్తారు. అక్షయ తృతీయ నాడు కుబేరుడిని పూజించి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సుకు ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. వ్యాపారంలో విజయాలు పొందుతారు.

విష్ణు మంత్రం

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

వైశాఖ మాసం మహా విష్ణువుకి అంకితం చేసిన మాసం. విశ్వాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని పాటించేవాడిగా మహావిష్ణువుని పూజిస్తారు. అక్షయ తృతీయనాడు విష్ణువుకు సంబంధించి ఈ మంత్రాన్ని జపించడం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయి. జీవితంలో శాంతి నెలకొంటుంది. అడ్డంకులు తొలగిపోతాయి. అన్నింటా విజయం మీదే అవుతుంది.

దుర్గా మంత్రం

ఓం దుం దుర్గాయే నమః

దుర్గాదేవిని విశ్వానికి రక్షకురాలుగా గౌరవిస్తారు. అక్షయ తృతీయ నాడు దుర్గాదేవికి సంబంధించి ఈ మంత్రాన్ని పఠిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ప్రతికూల శక్తుల నుండి మీకు రక్షణ ఉంటుంది. జీవితంలో బలం, ధైర్యం, శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు.

ఎంత పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ఈ శక్తివంతమైన మంత్రాలు పఠించడం వల్ల జీవితంలోనే అన్నింటా ఆనందంగా ఉంటుంది. దైవ ఆశీర్వాదాలు పొందుతారు. సంపద, విజయం, ఆనందం, సానుకూల శక్తులను ఆకర్షించడంలో, మీ లక్ష్యాలను సాధించడంలో ఈ మంత్రాలు పని చేస్తాయి. భక్తి విశ్వాసంతో ఈ మంత్రాలని జపిస్తే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది.

 

WhatsApp channel