AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ-ap ecet 2024 hall tickets released applications accepted today with rs 5000 fine ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ecet Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Sarath chandra.B HT Telugu
May 02, 2024 11:55 AM IST

AP ECET Hall Tickets: ఏపీ ఇంజనీరింగ్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2024 హాల్‌ టిక్కెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్ల విడుదల
ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్ల విడుదల

AP ECET 2024: ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ ఈసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. మే 1 నుంచి ఆన్‌‌లైన్‌లో ఈసెట్‌ హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. మే 8వ తేదీన ఏపీ ఈసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 10వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 12వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.

హాల్‌ టిక్కెట్ల కోసం ఈ లింకును అనుసరించండి.

ఆంధ్రప్రదేశ్‌ లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్‌ నోటిఫికేషన్ 2024 గత మార్చిలో విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల గడువు ఇప్పటికే ముగిసింది. రూ.5వేల ఆలస్య రుసుముతో నేడు కూడా ఈసెట్‌‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్ధులు ప్రవేశాలు పొందవచ్చు.

2024-25 విద్యా సంవత్సరంలో రెండో ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8వ తేదీన ఈసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు ఓ సెషన్, మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

ఈసెట్‌ 2024 ప్రవేశాల కోసం మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించారు. రూ.5వేల ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఏపీ ఈసెట్‌ 2024 ఇన్ఫర్మేషన్ బ్రోచర్, విద్యార్హతలు, కోర్సుల వారీగా అర్హతలు, ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమాల వారీగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించే కోర్సుల వివరాలు, సీట్ల లభ్యత, యూనివర్శిటీల పరిధిలో కళాశాలల జాబితా వంటి వివరాలు నోటిఫికేషన్‌‌ బ్రోచర్‌లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ వెల్లడించారు.

ఏపీ ఈసెట్ 2024 దరఖాస్తులను https://cets.apsche.ap.gov.in/ECET లో అందుబాటులోకి ఉన్నాయి.

ప్రవేశపరీక్ష ఇలా..

ఈసెట్ పరీక్షలో 200మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 మార్కులు మ్యాథ్స్‌ నుంచి ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మరో 100 మార్కులు సంబంధిత విభాగానికి సంబంధించినవి ఉంటాయి. ఫార్మసీ విభాగంలో ఫార్మాస్యూటిక్స్‌లో 50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో 50, ఫార్మాకాగ్నసీలో 50, ఫార్మాకాలజీలో 50 మార్కలుకు ప్రశ్నలు ఉంటాయి. బిఎస్సీ విద్యార్హతతో దరఖాస్తు చేసేవారికి మ్యాథ్స్‌లో 100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీలో 50, కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ బిఎస్సీ ప్రవేశాలకు డిప్లొమా కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారు ఏపీ ఆన్లైన్‌ కేంద్రాల్లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్‌వేల ద్వారా కూడా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్‌ కార్డు, నెట్ బ్యాంకింగ్‌తో ఫీజులు చెల్లించవచ్చు. ఓసీ అభ్యర్ధులు రూ.600, బీసీ విద్యార్ధులు రూ.550, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.500 ఫీజుగా చెల్లించాలి. నేడు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్ధులు ఫీజుతో పాటు రూ.5వేల ఆలస్య రుసుము కూడా చెల్లించాలి.

ఇప్పటికే దరఖాస్తు చేసిన విద్యార్ధులు హాల్‌ టిక్కెట్ల కోసం ఈ లింకును అనుసరించండి… https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetPrintHallTicket.aspx

IPL_Entry_Point

సంబంధిత కథనం