Oatmeal omelette: బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా ఓట్స్ ఆమ్లెట్ చేసుకోండి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ అల్పాహారం-oatmeal omelette recipe in telugu for diabetics know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oatmeal Omelette: బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా ఓట్స్ ఆమ్లెట్ చేసుకోండి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ అల్పాహారం

Oatmeal omelette: బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా ఓట్స్ ఆమ్లెట్ చేసుకోండి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ అల్పాహారం

Haritha Chappa HT Telugu
May 02, 2024 06:00 AM IST

Oatmeal omelette: బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కొన్ని ప్రత్యేకమైన అల్పాహారాలను తినాలి. అలాంటి బ్రేక్ ఫాస్ట్ లలో ఓట్స్ ఆమ్లెట్ ఒకటి.

ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ
ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ

Oatmeal omelette: అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఆ రోజంతా శరీరానికి శక్తి నిరంతరం అందుతూనే ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు అల్పాహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి కోసం ఇక్కడ మేము ప్రత్యేకమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఇచ్చాం. ఓట్స్, ఎగ్స్ కలిపి చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఓట్ మీల్ ఆమ్లెట్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి గుండెకు రక్షణగా నిలుస్తుంది. ఇక కోడిగుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే ఈ ఆహారాన్ని తినడం వల్ల ఆ రోజంతా చురుకుగా, ఉత్సాహంగా సాగుతుంది. ఆమ్లెట్ తయారు చేయడం చాలా సులువు. రెండు కోడిగుడ్లు, మూడు స్పూన్ల ఓట్స్ వేసుకుంటే చాలు... ఒకరికి పొట్ట నిండా బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది.

ఓట్ మీల్ ఆమ్లెట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఉడకబెట్టిన కోడిగుడ్లు - రెండు

ఓట్స్ - 50 గ్రాములు

పచ్చిమిర్చి - రెండు

టమాటా - ఒకటి

ఉల్లిపాయ - అర ముక్క

ఉప్పు - రుచికి సరిపడా

ఓట్ మీల్ ఆమ్లెట్ రెసిపీ

1. ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుని ఒక గిన్నెలో వేయాలి.

2. ఆ ఓట్స్ లోనే రెండు కోడిగుడ్లు కొట్టి బాగా గిలొక్కొట్టాలి.

3. ఆ మిశ్రమంలోనే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, టమాటా తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

4. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. ఆ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోండి.

5. రెండు వైపులా కాల్చుకుని ఆమ్లెట్ తీసి ప్లేటులో వేసుకుని సర్వ్ చేయాలి.

6. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఓట్స్ పొడిలో నాలుగు స్పూన్లు నీటిలో వేసి మెత్తబడే వరకు ఉంచి అందులో కోడిగుడ్లు కలిపి వేసుకున్నా మంచిదే.

7. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఉత్తమ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు.

ఓట్స్ తో చేసిన ఆహారాలను బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే అల్పాహారంలో ప్రొటీన్ నిండుగా ఉన్న గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఓట్స్ లో ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఓట్స్ తినడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు. ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

WhatsApp channel

టాపిక్