TS Polling Time : ఈసీ కీలక నిర్ణయం, తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు-hyderabad election commission increased lok sabha elections polling time up to 6 pm on may 13th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Polling Time : ఈసీ కీలక నిర్ణయం, తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు

TS Polling Time : ఈసీ కీలక నిర్ణయం, తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు

May 01, 2024, 08:56 PM IST Bandaru Satyaprasad
May 01, 2024, 08:56 PM , IST

  • TS Polling Time : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 13న జరిగే పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 13న జరిగే పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. 

(1 / 6)

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 13న జరిగే పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. (Twitter)

నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.  పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు పోలింగ్‌ సమయాన్ని పెంచినట్లు ఈసీ తెలిపింది. 

(2 / 6)

నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.  పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు పోలింగ్‌ సమయాన్ని పెంచినట్లు ఈసీ తెలిపింది. (Twitter)

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారన్నారు. 

(3 / 6)

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారన్నారు. (Twitter)

అదే విధంగా 285 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా 7 స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభించనున్నట్లు సీఈవో తెలిపారు. 

(4 / 6)

అదే విధంగా 285 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా 7 స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభించనున్నట్లు సీఈవో తెలిపారు. (Twitter)

హైదరాబాద్‌లో 3,986 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. ఇప్పటికే అన్నిచోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను జిల్లాల్లో ప్రింట్‌ చేస్తున్నారన్నారు. లోక్ సభ ఎన్నిక విధుల్లో 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బంది, 155 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలను వినియోగిస్తున్నామన్నారు. 

(5 / 6)

హైదరాబాద్‌లో 3,986 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. ఇప్పటికే అన్నిచోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను జిల్లాల్లో ప్రింట్‌ చేస్తున్నారన్నారు. లోక్ సభ ఎన్నిక విధుల్లో 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బంది, 155 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలను వినియోగిస్తున్నామన్నారు. 

తెలంగాణ రాష్ట్రంగా 35,809 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 15 వేల మంది సర్వీస్ ఓట్లు ఉన్నారన్నారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950 ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 1227 ఫిర్యాదులు వచ్చాయని, వారిని పరిష్కరించామన్నారు.  

(6 / 6)

తెలంగాణ రాష్ట్రంగా 35,809 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 15 వేల మంది సర్వీస్ ఓట్లు ఉన్నారన్నారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950 ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 1227 ఫిర్యాదులు వచ్చాయని, వారిని పరిష్కరించామన్నారు.  (Twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు