AP Nominations: ఏపీలో లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2387 నామినేషన్ల ఖరారు.. 367 మంది నామినేషన్ల ఉపసంహరణ-454 nominations for lok sabha and 2387 for assembly have been finalized in ap ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Nominations: ఏపీలో లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2387 నామినేషన్ల ఖరారు.. 367 మంది నామినేషన్ల ఉపసంహరణ

AP Nominations: ఏపీలో లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2387 నామినేషన్ల ఖరారు.. 367 మంది నామినేషన్ల ఉపసంహరణ

Sarath chandra.B HT Telugu
May 01, 2024 07:39 AM IST

AP Nominations: ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387మంది పోటీలో నిలిచారు.

ఏపీ ఈసీ సీఈఓ ముఖేష్‌ కుమార్ మీనా
ఏపీ ఈసీ సీఈఓ ముఖేష్‌ కుమార్ మీనా

AP Nominations: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను Election commission ఎన్నికల సంఘం ప్రకటించింది. నియోజక వర్గాల వారీగా తుది జాబితాను ప్రకటించారు.

ఏపీలో 25 లోక్‌సభ Loksabha స్థానాలకు 454 మంది, 175 Assembly అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు Nominations వేసిన వారిలో 49మంది, అసెంబ్లీ నియోజక వర్గాల్లో 318మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు.

మే 13న ఏపీలో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. సోమవారం అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 25 పార్లమెంటు నియోజక వర్గాల స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 అభ్యర్థులు మే 13 న జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు EC CEO రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసిందని, పెద్ద ఎత్తులు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలకు మొత్తం 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోఉన్నట్లు సీఈఓ తెలిపారు. వచ్చే నెల 13 న జరుగనున్న ఎన్నికల్లో వీరంతా వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులుగా ఎన్నికల్లో పోటీ పడనున్నారన్నారు.

పార్లమెంటు నియోజక వర్గాల్లో సంబందించి 49 మంది అభ్యర్థులు మరియు అసెంబ్లీ స్థానాల్లో 318 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి మొత్తము 503 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు 2,705 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.

పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి అత్యధికంగా విశాఖ పార్లమెంటు స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

అసెంబ్లీ స్థానాలకు సంబందించి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు తిరుపతి నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా 6గురు అభ్యర్థులు చోడవరం అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీపడుతున్నారు.

WhatsApp channel