AU MBA Admissions : ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్ లైన్ ఎంబీఏ కోర్సులు, ఇలా దరఖాస్తు చేసుకోండి!-visakhapatnam andhra university online mba courses admission 2024 apply process check ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Au Mba Admissions : ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్ లైన్ ఎంబీఏ కోర్సులు, ఇలా దరఖాస్తు చేసుకోండి!

AU MBA Admissions : ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్ లైన్ ఎంబీఏ కోర్సులు, ఇలా దరఖాస్తు చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Apr 30, 2024 06:22 PM IST

AU MBA Admissions : ఆంధ్ర యూనివర్సిటిలో ఆన్ లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్ లైన్ ఎంబీఏ కోర్సులు
ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్ లైన్ ఎంబీఏ కోర్సులు

AU MBA Admissions : విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University)లో వచ్చే విద్యాసంవత్సరానికి(2024-25) లాజిస్టిక్స్ ఎంబీఏ (MBA Admissions)ప్రోగ్రామ్స్(Self Supported)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆంధ్ర యూనివర్సిటీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్ తో కలిసి ఈ కోర్సులను ఆన్ లైన్ ద్వారా అందిస్తోంది. లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనెజ్మెంట్ లో రెండేళ్ల ఎంబీఏ డిగ్రీ ప్రోగ్రామ్ ను ఏయూ అందిస్తోంది. ఈ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ఎంబీఏ కోర్సుకు అర్హులు. భద్రతా దళాలలో పనిచేస్తున్న వారికి, డిపెండెండ్స్‌, వార్డ్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ కోర్సుకు డిఫెన్స్ పర్సనల్స్, డిపెండెంట్లు రూ.40 వేలు, ఇతరులకు రూ.60 వేలు కోర్సు ఫీజుగా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లికేషన్లను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆఫీస్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెదవాల్తేరు, విశాఖపట్నం అడ్రస్ కు పంపించాలి. ఏయూ ఎంబీఏ కోర్సుల దరఖాస్తుకు జూన్ 18, 2024 చివరి తేదీ. విద్యార్థులకు జూన్ 20న సీట్లు కేటాయిస్తారు.

ఏయూ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) నిర్వహించిన వివిధ కోర్సుల ఫలితాలను(AU Results 2024) విడుదల చేసింది. ఎంసీఏ, ఎంబీఏ, బీఏ, బీఎఫ్ఏ, ఎంఎస్సీ, ఎంపీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ వంటి వివిధ కోర్సుల సెమిస్టర్ ఫలితాలను(AU Semester Results) ఏయూ ఇటీవల విడుదల చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ andhrauniversity.edu.inలో ఫలితాలను విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.

ఏయూ పరీక్షల ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?(AU Results 2024 Download)

వివిధ యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల కోసం నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో చూడవచ్చు.

Step 1 : ఆంధ్ర యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ని andhrauniversity.edu.in సందర్శించండి.

Step 2 : హోం పేజీలో 'ఎగ్జామినేషన్ ' ఆప్షన్ పై క్లిక్ చేయండి

Step 3 : తర్వాతి పేజీలో 'Results'పై క్లిక్ చేయండి.

Step 4: మీ స్ట్రీమ్‌ని ఎంచుకుని, కోర్సుపై క్లిక్ చేయండి.

Step 5 : విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

Step 6 : విద్యార్థి ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

Step 7: రిజల్ట్స్ ను చెక్ చేసుకుని, భవిష్యత్తు సూచన కోసం డౌన్‌లోడ్ చేసుకోండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం