Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 89 సంఖ్య మధ్య మరో అంకె దాక్కుని ఉంది, అది ఏదో 10 సెకన్లలో కనిపెట్టండి-in this optical illusion there is another number hidden between number 89 find it in 10 seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 89 సంఖ్య మధ్య మరో అంకె దాక్కుని ఉంది, అది ఏదో 10 సెకన్లలో కనిపెట్టండి

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 89 సంఖ్య మధ్య మరో అంకె దాక్కుని ఉంది, అది ఏదో 10 సెకన్లలో కనిపెట్టండి

Haritha Chappa HT Telugu
May 02, 2024 01:00 PM IST

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో ఎన్నో 89 అంకెలు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక వేరే అంకె దాక్కుని ఉంది. అది ఏంటో కనిపెట్టి 10 సెకన్లలో చెబితే మీరు తోపు అని ఒప్పుకోవచ్చు

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: మీకు ఆప్టికల్ ఇల్యుషన్లంటే ఆసక్తి ఎక్కువా? అయితే మరొక ఆప్టికల్ ఇల్ల్యూషన్ తో మీ ముందుకు వచ్చాము. ఇందులో 89 సంఖ్య అనేకసార్లు ఉంది. ఈ 89 సంఖ్య మధ్య మరొక అంకె కూడా దాక్కొని ఉంది. అదేంటో కనుక్కొని మీరు కేవలం 10 సెకన్లలో చెప్పాలి. అలా చెబితే మీ కంటి చూపు సూపర్ అని, మీ మెదడు పవర్ ఎక్కువ అని ఒప్పుకుంటాము. పది సెకన్లకు మించి ఎక్కువ సమయం తీసుకుంటే ఎవరైనా దీన్ని కనిపెట్టేయొచ్చు. కేవలం 10 సెకన్లలోనే దీన్ని కనిపెట్టి చెప్పాలి.

ఆప్టికల్ ఇల్యుషన్ జవాబు

అనేక 89 అంకెల మధ్య వేరే అంకె దాక్కుని ఉందని చెప్పాము. అది 88. కేవలం 10 సెకన్ల లోపే ఈ అంకెను కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబు విషయానికి వస్తే ఆరో నిలువ వరుసలో నాలుగో లైన్ లో ఈ 88 అనే అంకె ఉంది. అదే జవాబు.

స్కూలు పిల్లలకు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పాలి. ఇది వారి ఆలోచనా నైపుణ్యాన్ని, సమస్యలను పరిష్కరించే శక్తిని పెంచుతుంది. వారు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు అలవాటు చేస్తే... వారి మెదడు పనితీరు కూడా మారుతుంది. చురుగ్గా పనిచేయడం, మెదడు, కంటి మధ్య సమన్వయం పెరగడం వంటివి జరుగుతాయి.

ఆప్టికల్ ఇల్యూషన్ చరిత్ర

ఆప్టికల్ ఇల్ల్యూషన్లు అనేక రకాలు ఉన్నాయి. ఇది నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్. ఆప్టికల్ ఇల్యూషన్లు ఏవైనా కూడా మెదడుకు పదును పెట్టేవి ఇలాగే ఉంటాయి. అలాగే కంటి చూపుకు సవాలు విసురుతాయి. కాబట్టి అన్ని రకాల ఆప్టికల్ఇల్యూషన్లు తరుచూ సాధిస్తూ ఉండాలి. ఆప్టికల్ ఇల్యూషన్ల చరిత్ర కూడా ఈనాటిది కాదు. ఎన్నో వేల క్రితం నుంచే ఇవి వాడుకులో ఉన్నాయని చెబుతుంటారు. గ్రీసు దేశంలో ఒకప్పుడు వీటిని వినోదాత్మక పద్ధతిలో వాడుకునే వారని అంటారు.

గ్రీసు దేశంలో బయటపడిన పురాతన దేవాలయాలపై ఈ ఆప్టికల్ ఇల్యూషన్ల చిత్రాలను గుర్తించారు. చరిత్రకారులు దీన్నిబట్టి వీటి ఉనికి ఈనాటిది కాదని వివరిస్తున్నారు. ఇక ఆప్టికల్ ఇల్యూషన్లను సృష్టించే వారి సంఖ్య కూడా ఇప్పుడు పెరిగిపోయింది. ఎంతోమంది చిత్రకారులు సోషల్ మీడియా వచ్చాక ఆప్టికల్ ఇల్యూషన్ డిజైనర్లుగా మారిపోయారు. వీరు రకరకాల ఆప్టికల్ ఇల్యూషన్లను సృష్టించి ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి వైరల్ అవుతూ ఎన్నో దేశాలకు ప్రయాణం చేస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు కోసం ఏకంగా ఇన్‌స్టా పేజీలు, యూట్యూబ్ ఖాతాలు కూడా రన్ అవుతున్నాయి. మీకు ఆసక్తిగా అనిపిస్తే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు ప్రచురించే ఇన్స్టా గ్రామ్ ఖాతాలను అనుసరించండి. ప్రతిరోజూ వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి. మీ మెదడు, కంటి శక్తిని పెంచుకోండి.

WhatsApp channel

టాపిక్