క్రమం తప్పకుండా యోగా సాధన బరువు తగ్గడానికి, ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పొట్ట దిగువ భాగంలో కొవ్వును తగ్గించడానికి ఈ 5 ఆసనాలు ప్రయత్నించండి.
pexels
విల్లు భంగిమ -ఈ భంగిమను ధనురాసనం అని పిలుస్తాయి. ఈ యోగాసనం శరీర దిగువ కండరాలను, ముఖ్యంగా బొడ్డు దిగువ శరీరం, తొడలను పటిష్టం చేయడానికి సహాయపడుతుంది.
pexels
కోబ్రా భంగిమ - భుజంగాసనం పొత్తి కడుపులోని కొవ్వును తగ్గించడానికి అద్భుతమైన యోగా ఆసనం. ఇది పొట్ట కండరాలను పటిష్టం చేస్తుంది.
pexels
పడవ భంగిమ - ఈ యోగాసనాన్ని నౌకాసనం అని పిలుస్తారు. ఇది బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్ట కండరాలను బలపరుస్తుంది.
pexels
బ్రిడ్జి భంగిమ - ప్రతి రోజు సేతు బంధాసన సాధన చేయడం వల్ల మీ పొత్తి కడుపు కండరాలను సాగదీయడం, టోన్ చేయడం వల్ల పొట్టలోని కొవ్వును సమర్థవంతంగా తగ్గించవచ్చు.
pexels
చక్రాల భంగిమ - ఈ యోగాసనాన్ని చక్రాసనం అని అంటారు. బొడ్డు దిగువ కొవ్వును తగ్గించడానికి, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
pexels
యోగాసనాలు ప్రయత్నించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల పర్యవేక్షణలో ఈ ఆసనాలు ప్రయత్నించడం మంచిది.
pexels
గర్భం సమయంలో మహిళలు జంక్ ఫుడ్ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు.. జాగ్రత్త!