చలికాలంలో చాలా మంది రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని రోగాల బారిన పడుతుంటారు. అలా కాకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో చూడండి

pexels

By Hari Prasad S
Nov 12, 2024

Hindustan Times
Telugu

బాదాం, వాల్ నట్స్, చియా గింజల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, జింక్, ఆరోగ్యవంతమైన కొవ్వులు ఇమ్యూనిటీకి మంచివి

pexels

వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే మూలకం రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచి చలికాలంలో వచ్చే జలుబు, ఇతర వ్యాధులను దరిచేయనీయదు

pexels

అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతునొప్పిని తగ్గించడంతోపాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది

pexels

పసుపులో ఉండే కర్కుమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది

pexels

ఆరెంజెస్, లెమన్, గ్రేప్ ఫ్రూట్స్ లాంటి సిట్రస్ పండ్లలో ఇమ్యూనిటీని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

pexels

చిలగడ దుంప లేదా కంద గడ్డలో బీటా కెరొటిన్ పుష్కలంగా ఉండి అది ఇమ్యూనిటీని పెంచడంతోపాటు చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుతుంది

pexels

పాలకూరలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తాయి

pexels

చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఇవి తప్పక తీసుకోండి

Photo: Pexels