చలికాలంలో పిల్లలు తరచుగా జలుబు, ఫ్లూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు శీతాకాలపు ఆహారంలో జోడించాల్సిన ఐదు ఆరోగ్యకరమైన వంటకాలు గురించి తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Nov 27, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో పిల్లలు గొంతు నొప్పి, జలుబు, ఇన్‌ఫ్లూయెంజా మొదలైన వాటితో అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి పిల్లలకు సమతుల్య, పోషకమైన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం.  

చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా రోగనిరోధక శక్తి పెంచేందుకు వారి ఆహారంలో వివిధ పోషకాలు ఉండేలా చూడండి.  

క్యారెట్లు - క్యారెట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ రోగనిరోధక శక్తిని, కంటి చూపును పెంచడంలో సహాయపడతాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను రక్షిస్తాయి.  

pexels

చిలగడదుంపలు- స్వీట్ పొటాటోస్ వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో బీటా-కెరోటిన్, విటమిన్ సి కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.  

pexels

బజ్రా - బజ్రా ఎనర్జీ, పోషకాలకు గొప్ప మూలం. ఇది పిల్లలకు చాలా మంచి ఆహారం. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.  

pexels

డేట్స్- ఖర్జూరంలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.   

pexels

 నట్స్, సీడ్స్ పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే మంచి ఆహారాలు. విత్తనాలు, గింజలలో ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్స్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  

pexels

తేనె సంపూర్ణ ఆహారమే కాకుండా సర్వరోగ నివారిణిగా కూడా పనిచేస్తుంది. తేనెను అమృతంగా కూడా పరిగణించవచ్చు. ఎన్ని సంవత్సరాలు పాటు నిల్వ చేసినా దాని రంగు, రుచిలో ఎలాంటి మార్పు ఉండదు.